Jr NTR, Ram Charan Fans: ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్న ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల అభిమానులు..!

  • May 21, 2021 / 04:24 PM IST

గత కొన్ని గంటల నుండీ ఎన్టీఆర్ అభిమానులు అలాగే రాంచరణ్ అభిమానుల మధ్య ఘోరమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇది ఇండియా వైడ్ ట్రెండ్ అవుతూ ఉండటం.. చింతించాల్సిన విషయం. ఒకరిని మించి ఒకరు అన్నట్టు హ్యాష్ ట్యాగ్ లు క్రియేట్ చేసుకుని ట్రోల్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్,చరణ్ అభిమానులు.తోటి హీరోల మధ్య, వారి సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండడం సహజం. ఈ మధ్య కాలంలో ఫ్యాన్ వార్స్ అనేవి తగ్గాయనుకున్నారు. హీరోల పుట్టినరోజు నాడు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తూ తమ హీరో గొప్ప అన్నట్టు చెప్పుకుంటున్నారు తప్ప ట్రోలింగ్ జోలికి పోవడం లేదు.

కానీ ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ‘FanBaseLessRamCharan’, ‘FanBaseLessNTR’ అనే హ్యాష్ ట్యాగ్‌లను దేశవ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు చక్కగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాంటప్పుడు వీళ్ళ మధ్య గొడవ ఎందుకు స్టార్ట్ అయ్యింది అనే డౌట్ రావచ్చు. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో కొమరం భీమ్ పాత్రకు సంబంధించి… ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ కు కొంత డివైడ్ టాక్ వచ్చింది. ‘రాజమౌళి నుండీ ఇలాంటి పోస్టర్ ను ఊహించలేదు’ అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.

ఈ క్రమంలో చరణ్ అభిమానులు.. చరణ్ బర్త్ డే రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ టీం విడుదల చేసిన పోస్టర్ ను ఎన్టీఆర్ పోస్టర్ తో కంపేర్ చేస్తూ.. ట్వీట్లు వేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంతోనే ట్రోలింగ్ మొదలైనట్టు స్పష్టమవుతుంది. ఒక్క పోస్టర్ లో హీరోని తక్కువ చేస్తేనే ఈ రేంజ్లో ట్రోలింగ్ జరిగితే.. రేపు సినిమాలో కనుక రాజమౌళి ఏ హీరోకి అయినా తక్కువ ప్రాధాన్యత ఇస్తే.. భారీగా నిరసనలు వ్యక్తమవ్వడం ఖాయమనే చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus