దిల్ రాజు, రవితేజ ల మధ్య వివాదం?

  • February 26, 2016 / 05:49 PM IST

‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత  రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఎవడో ఒకడు’ చిత్రంలో నటించబోతున్నాడనే తెలిసిన విషయమే. ఇటీవల దిల్ రాజుకు రవితేజకి మధ్య వివాదం రావడంతో ఈ చిత్రం నుండి రవితేజ తప్పుకున్నాడు. ‘ఓ మై ఫ్రెండ్’ దర్శకుడు వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించబోతున్న ‘ఎవడో ఒకడు’ చిత్రంలో రవితేజకి బదులు నాగార్జునని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ విషయాలకు దిల్ రాజు స్పందించి వివరణ ఇచ్చాడు. ‘రవితేజతో నాకు మంచి స్నేహం ఉందని, నిర్మాత, హీరో ఉంటె సినిమా అయిపోదని సినిమాకి ఏమేమి కావాలో అన్ని విషయాలను చూసుకోవాలని అలాంటి కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని’ తెలిపాడు.

రవితేజ కూడా ఈ సినిమా కి బాగా ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రానందువలన సినిమాని ఆపేశామని దిల్ రాజు తెలిపాడు. రవితేజతో తనకి ఎలాంటి విభేదాలులేవని ఇప్పటికి నాకు ఫోన్ లో టచ్ లో ఉంటాడని దిల్ రాజు తెలిపారు. కాని ప్రస్తుతం ఈ సినిమాలో హీరోగా నాగార్జునను నటింపజేసేందుకు దిల్ రాజు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో దిల్ రాజు రవితేజ ల మధ్య వ్యవహారం పూర్తిగా చెడిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags