రౌడీల వల్లే నా కూడు నేను తింటూ నా వోడ్కా నేను తాగుతున్నా-వర్మ
- February 17, 2016 / 12:49 PM ISTByFilmy Focus
వివాదాల రామ్ గోపాల్ వర్మ తాను తీయబోతున్న వంగవీటి రంగ సినిమా విషయాల పై కొన్ని వర్గాల నుండి వస్తున్న వ్యతిరేకత గురించి చర్చించడానికి నిన్న సాయింత్రం ఒక ప్రముఖ ఛానల్ ముందుకు లైవ్ షోకు వచ్చాడు.నా సినిమాలో కమ్మ కాపు కులాల మధ్య ఘర్షణ అసలు ఉండదు. నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా, నచ్చితే చూడండి లేకపోతే లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు వర్మ. ఈ కార్యక్రమంలో వివాదాల వర్మకూ, నటుడు హీరో శివాజీకీ మధ్య లైవ్ నడిచింది.
ఈ సినిమాలోని పాట కులాల మధ్య విద్వేషాలు రేపెలా ఉన్నాయి అని,ప్రజల మనసు గాయపరచిన చరిత్ర మీద సినిమా తీసి నువ్వు సాధించేది ఏమిటి అని నటుడు శివాజీ వర్మ ని ప్రశ్నించడంతో వర్మ ఆవేశంగా నాకే క్లాసు పీకుతావా అని సటైర్ వేసాడు.
అదే చర్చలో విజయవాడ రౌడీల వల్లనే తానూ ఈ రోజున తన కూడు తానూ తింటూ,తన వోడ్కా తను తాగుతున్నాను అని,అంతేకాని తల్లిదండ్రులు,గురువులు,దేవుడి వల్ల కాదు, అని చెప్పి అందరి మైండ్ బ్లాంక్ చేసాడు.విజయవాడ రౌడీలను ఆకాశానికి ఎత్తేశాడు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














