రజని డైలాగ్ కోసం సూర్య-ధనుష్ రగడ!!!

  • September 23, 2016 / 11:00 AM IST

మీరు తలైవార్ రజనీకాంత్ నటించిన భాషా సినిమా చూశారా అని అడిగితే….నువ్వు అసలు తెలుగు వాడివేనా అని అన్నా అంటారు….కానీ….ఈ సినిమా తమిళ్ లో ఒక మంచి డైలాగ్ ఉంది….అదేమిటంటే….”తానా సెరిందా కూట్టమ్” అయితే ఇదెప్పుడో వచ్చిన సినిమా డైలాగ్ అని ఊరికినే టీఈ పడేయ్యలేం….ఎందుకంటే  ఈ డైలాగ్ కోసం ఇద్దరు హీరోలు బాహాబాహీకి దిగినంత పనిచేశారు అనే చెప్పాలి…ఇంతకీ విషయం ఏమిటంటే….ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల మధ్య కాంపిటీషన్ ఉంటుంది.

ముఖ్యంగా అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే ఎక్కువ పోటీ…కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలకే ఎక్కవుగా ఉంటుంది. ఇక కాలీవుడ్ కి అటు ధనుష్….ఇటు సూర్య ఇద్దరికీ దాదాపుగా భారీ స్టార్ ఇమేజ్ ఉందనే ఉంది…అదంతా పక్కన పెడితే…తాజాగా రజనీకాంత్ అల్లుడు ధనుష్ కి స్టార్ హీరో సూర్య వార్నింగ్ ఇచ్చాడనే న్యూస్ పై క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ వివరాల్లోకి వెళితే….సింగం3తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలి అని అనుకుంటున్న సూర్య…మరో పక్క రజనికాంత్ అల్లుడు ఇద్దరు….ఒక టైటిల్ కోసం గొడవలు పడుతూ ఉన్నారు…ధనుష్ గతంలో ‘తానా సెరిందా కూట్టమ్’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించాలని చూశాడు.

కానీ ఈ న్యూస్ ని తెలుసుకున్న సూర్య…ఈ టైటిల్ ని తనకి అయితే కరెక్ట్ గా సరిపోతుందని ఆ టైటిల్ ని రెండు సంవత్సరాల క్రితమే రిజిష్టర్ చేయించాడంట. దీంతో ఈ ఇద్దరూ ‘తానా సెరిందా కూట్టమ్’ అనే టైటిల్ పై ఆధిపత్యం చూపించుకునే ప్రదర్శన చేస్తూనే వస్తున్నారు. అయితే వెరీ రీసెంట్ గా విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో సూర్య ఓ మూవీని చేస్తున్నట్టుగా, ఆ మూవీ టైటిల్ ‘తానా సెరిందా కూట్టమ్’ అని బయటకు అనౌన్స్ చేశాడు. ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో ధనుష్ న్యాయ పోరాటం చేస్తాను అంటున్నాడు….కానీ న్యాయపరంగా చూసినా ఆ టైటిల్ సూర్యకె దక్కుతుంది..మరి దీనిపై ధనుష్ ఏంచెస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus