Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నిర్మాత‌లుగా ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం – నిర్మాత భ‌ర‌త్ చౌద‌రి

నిర్మాత‌లుగా ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం – నిర్మాత భ‌ర‌త్ చౌద‌రి

  • March 27, 2018 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాత‌లుగా ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం – నిర్మాత భ‌ర‌త్ చౌద‌రి

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సినిమాను నిర్మించారు. ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. సినిమా మార్చి 23న విడుద‌లైంది. ఈ సందర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ….

నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ – ‘‘నేను సాధారణంగా నా స్వంత బ్యానర్లోనే సినిమాలు చేస్తుంటాను. బయట బ్యానర్‌లో చేసిన సినిమాలేవీ సరిగ్గా ఆడలేదు. అందుకు కారణాలు తెలియులేదు. కానీ నా మనసులో ఆ సెంటిమెంట్ ఉండిపోయింది. మన సినిమా ఆడి.. ప్రొడ్యూసర్‌కి డబ్బులు వస్తే అంతకంటే ఏం కావాలి? ఇంత పెద్ద సక్సెస్‌తో నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చిత్రమిది. ఒకటిన్నర సంవత్సరం తర్వాత నా సినిమా విడుదలై సక్సెస్ అందుకుంది. బాగా చదువుకుంటే నీకంటూ ప్రత్యేక‌మెన గుర్తింపు వస్తుందని నాతల్లిదండ్రులు నాకు చెప్పారు. ఇదే విషయం మన అందరి ఇళ్లలో రన్ అవుతుంటుంది. ఎప్పుైడెతే ఆ ఎలిమెంట్‌తో ఉన్న పాయింట్ చెప్పాడు. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుందనిపించింది. చైల్డ్ లేబర్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై కథను చేసి సినిమా చేసినందుకు ఉపేంద్ర మాధవ్‌కు థాంక్స్. గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌గారి సతీమణి ఫోన్ చేసి.. ‘ముందుగా థాంక్స్ చెబుతున్నాను. కమ‌ర్షియల్ సినిమా అంటే ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అమ్మాయిలను అశ్లీలంగా చూపిస్తారు. కానీ అవేవీ లేకుండా ఈ సినిమా కటుంబం అంతా కలిసి చూసేలా ఉంది’ అన్నారు. ప్రసాద్ మూరెళ్లగారు నన్ను ఎంతో అందంగా చూపించారు. సినిమా చూసినంత సేపు ఎంటర్ టైనింగ్‌గా ఉండాలి.. బోర్ కొట్టకూడదని అనుకుంటాను. అలాంటి మాటలు ఏవీ వినపడకుండా సినిమాను ఎడిట్ చేసిన తమ్మిరాజుగారికి థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు మనకు సహకారం అందించిన అందరినీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. నా మేకప్ మేన్ వెంకట్ సహా రాజు, రాకీ, గౌస్, డ్రైవర్ తిరుపతి ..ఎప్పుడూ నా వెన్నంటే ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లు నాకు ఎం కావాలో అవన్నీ అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే తాహిర్ టెక్ తాహీర్, నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడే తను జర్నీని స్టార్ట్ చేశాడు. ప్రతి యన్.టి.ఆర్.ఆర్ట్స్ సినిమాకు తన వంతు సపోర్ట్ చేశారు. అతనొక్కడే సినిమాలో మణిశర్మగారు అందించిన కాక పి.ఆర్.ఓలుగా నాకు ఈ సినిమా విషయంలో ఎంతో సహకారం అందించారు. ఫైట్ మాస్టర్ వెంకట్‌తో పనిచేయడం సులభంగా ఉంటుంది. తనతో మంచి అనుబంధం ఉంది. అలాగే రియల్ సతీశ్‌గారికి కూడా థాంక్స్. కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శోభిలకు థాంక్స్. డబ్బింగ్ టెక్నీషియన్ పప్పుకు థాంక్స్. టెక్నీషియన్స్, నటీనటులు లేకుంటే కేవలం హీరో మాత్రమే సినిమా చేయులేడు. కాజల్ అగర్వాల్..కమిట్‌మెంట్ ఉన్న నటి. విదేశాల్లో అనుకున్న సవుయంలో షూటింగ్ పూర్తి చేయుడానికి తన వంతు సహకారాన్ని అందించింది. తను లక్కీ హీరోయిన్. ఈ ఉగాది, శ్రీరావునవమిని మరచిపోలేను. అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ – ‘‘నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. కల్యాణ్‌రావ్‌ుమంచి లక్షణాలున్న అబ్బాయే కాదు.. మంచి లక్షణాలున్న బంగారం. ఆయునకు గాయమైనా మాకు సపోర్ట్ అందించి సినిమాను సకాలంలో పూర్తి చేసేలా సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్‌గా హరేరామ్, ఇజం, ఇప్పుడు ఎం.ఎల్.ఎ సినిమాలో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాకు. నిర్మాతగా ఈ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ సక్సెస్‌తో గర్వంగా ఫీలవుతున్నాం. అలాగే కాజల్ డేట్స్ సమస్య వచ్చినా.. అడ్జస్ట్ చేసి సపోర్ట్ చేశారు. మా బ్యానర్‌లో ఆమె చేసిన రెండో సినిమా కూడా హిట్ కావడం ఆనందంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, తమ్మిరాజుగారి ఎడిటింగ్, మణిశర్మగారి మ్యూజిక్ ఇలా అందరూ సక్సెస్‌లో తమ వంతు పాత్ర పోషించారు.ఉపేంద్ర సక్సెస్‌ఫుల్ రైటరే కాదు. ఆ సినిమాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కూడా అయ్యారు. మా బ్యానర్ ద్వారా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ని పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. సినిమా శాటిైలెట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ హక్కులను మంచి రేటుకు విక్రయించాం. ఇక కలెక్షన్స్ పరంగా నేటితో సేఫ్ జోన్‌లోకి వెళ్లాం. రేపటి నుండి మాకు వచ్చేవన్నీ ఓవర్‌ఫ్లో కలెక్షన్స్ మాత్రమే. అలాగే సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు, ఇతర యూనిట్ సభ్యులందరికీ థాంక్స్’’ అన్నారు.

ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ – ‘‘రివ్యూస్ మిక్స్‌డ్‌గా వచ్చాయి అని డీలా పడ్డాను. అయితే నిన్న రాత్రి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌గారు ఇచ్చిన కలెక్షన్స్‌ను చూసి హ్యాపీగా అనిపించి నిర్మాతలతో మాట్లాడాను. మనం పెట్టిన డబ్బులు వచ్చేశాయండి అని వారు చెప్పడంతో హ్యాపీగా నిద్రపోయాను. నాకు అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్‌రావ్ గారికి, నిర్మాతలకు, మణిశర్మగారు, ప్రసాద్ మూరెళ్ల, తమ్మిరాజు సహా… ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘చాలా మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. అలాగే సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.
ఈ కార్యక్రమంలో కోన వెంకట్, గిరిధర్, కరాటే కల్యాణి, అజయ్ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Kalyan Ram
  • #MLA
  • #MLA Movie

Also Read

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

related news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

trending news

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

1 hour ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

2 hours ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

2 hours ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

3 hours ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago

latest news

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

13 mins ago
Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

1 hour ago
DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

2 hours ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

5 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version