యాంటి ‘పవనిజమ్’ ఏం చెయ్యబోతుంది??

  • May 24, 2016 / 11:12 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై అభిమానంతో ఆయన అభిమానులు పవనిజమ్ అనే ఒక పదాన్ని అడ్డుపెట్టుకుని, పవనిజమ్ అంటే ఒక కులం అని తమ అభిమాన హీరోపై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా యాంటి పవనిజమ్ కూడా సరికొత్త అవతారం ఎత్తింది. ఇంతకీ యాంటీ పవనిజమ్ ఏంటి?? ఎవరా సభ్యులు అంటే….ఒక్కసారి ఈ కధ చదవండి… ఈమధ్య ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్ళినా పవర్ స్టార్……

పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ భజన చేస్తుండటం వల్ల మెగా ఫ్యామిలీ లోని ఇతర హీరోలు కాస్త ఇబ్బంది పడ్డారట. ఐక్ దీనిపై ఇప్పటికే బన్నీ తనలోని బాధని బయటపెట్టాడు కూడా. అయితే అయినా ఈ గొడవకి అట్టుకట్ట పడకపోవడంతో దీనిపై ఒక స్పెషల్ పద్దతిని ఫాలో అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ సన్నాహాలు ఏంటంటే…గోల కనిపించకుండా, వినిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో..కొంతమందిని ఏర్పాటు చేసారట. వాళ్ళు ఏం చేస్తారు అంటే… మెగా ఈవెంట్ల లో ఎవరైనా వక్తలు మాట్లాడుతున్న సమయంలో కనుక పవర్ స్టార్ …… పవర్ స్టార్ అంటూ అరిస్తే వెంటనే ‘యాంటీ పవనిజం ‘ సభ్యులు యాక్టివేట్ అయిపోయి సదరు గోల లేకుండా చేస్తారట . మరి పవన్ అభిమానులారా కాస్త జాగ్రత్త.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus