ఆ హీరోయిన్ ఫ్యాన్స్ బాధపడేలా ఉంది ఆ లుక్..!

  • September 16, 2019 / 04:33 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఒప్పేసింది పొడుగు కాళ్ళ సుందరి సిమ్రాన్. ఒకప్పుడు ఈమె.. ఏ సినిమాలో ఉంది అంటే ప్రత్యేకంగా ఆమె కోసమే సినిమాకి వెళ్ళే అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారితో కలిసి నటించింది. ఈమె అకౌంట్లో చాలా బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సౌత్లో ఈమె కాల్షీట్ల కోసం… దర్శక నిర్మాతలు క్యూలు కట్టేవారు. హిందీలో కూడా ఆమె చాలా చిత్రాలల్లో నటించింది.

అంత గ్లామర్ గల ఈ నటి తాజా ఫోటో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తన ఇన్స్టాగ్రామ్లో తాజాగా ఓ ఫోటోని షేర్ చేసింది సిమ్రాన్. నెరిసిన జుట్టుతో మేకప్ లేకుండా ఉన్న ఈ భామని చూస్తే ఈమె నిజంగా సిమ్రానేనా అనే అనుమానం కలుగక మానదు. అప్పట్లో గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన ఈమె ఇలా ఎందుకైపోయినట్టు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 2003లో వివాహం జరిగినప్పటికీ సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇక ఈమధ్యకాలంలో విశాల్ ‘డిటెక్టివ్’, రజినీ కాంత్ ‘పేట’ సినిమాల్లో కనిపించింది సిమ్రాన్.

1

2

3

4

5

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus