డైరక్టర్‌గా తేజ కెరీర్ మొదలైంది… ‘చిత్రం’తో. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ఆ సినిమాతోనే స్టార్ట్ చేస్తానని ఇటవల ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కమ్ముకోవడంతో ఆ సినిమా ముచ్చట్లు ఏవీ వినిపించలేదు. ఆ సినిమాలో ప్రముఖ హీరో బావమరిది నటిస్తాడని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే… తేజ ఆ సినిమాను పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. కారణం ఆయన వేరే సినిమా మొదలుపెట్టడమే. సురేశ్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో.. తేజ ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి.
ఆ సినిమా తాజాగా ప్రారంభమైంది. సినిమాకు ‘అహింస’ అనే పేరు పెట్టారు. కాబట్టి ఇది ‘చిత్రం ’ సీక్వెల్ కాదు. ఈ సినిమా ఎలాగూ తేజ వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేస్తారు. కరోనా అనుమతిస్తే… సినిమా విడుదల కూడా అయిపోతుంది. కాబట్టి ఈ సినిమా విషయం పక్కనపెట్టేద్దాం. ఇప్పుడు ఆలోచన అంతా ఆ సినిమా ఏమైంది. ‘చిత్రం’ సీక్వెల్‌ను కొత్తవాళ్లతో చేస్తాం అని ప్రకటించారు. దాని పేరు ‘చిత్రం 1.1’ అని పోస్టర్ కూడా విడుదల చేశారు.
తేజ కొత్త వాళ్లతో సినిమా అన్నారు అంటే… అందులో హీరో ఏదో ఒక ప్రముఖ నిర్మాత కొడుకో, బంధువో అవుతుంటారు. గతంలో కొన్నిసార్లు ఇది జరిగింది. ఈసారి కూడా అలానే అనుకున్నారంతా. కానీ ఏమైందో కానీ… ఆ సినిమా పక్కకు వెళ్లిపోయిందనిపిస్తోంది. లేకపోతే ‘అహింస’తోపాటు.. ప్యారలల్‌గా ‘చిత్రం 1.1’ కూడా చేస్తారేమో చూడాలి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!