Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

రూ.7000 కోట్ల పరిహారం చెల్లించండి.. రీసెంట్‌గా ఓ నటి చేసిన ఈ డిమాండ్‌ ఇప్పుడు సినిమా పరిశ్రమలో, అటు టెక్నాలజీ రంగంలో, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఈ డిమాండ్‌ చేసింది ఐటమ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ ఊర్వశీ రౌటేలా. ఆమె కామెంట్లను ఫేస్‌ చేస్తోంది బాలీవుడ్‌.ఏఐ, హాలీవుడ్‌.ఏఐ కంపెనీల ఓనర్‌ షీరాజ్‌. ఇంతకీ ఏమైందంటే…

Urvashi Rautela

లాస్ ఏంజెలెస్‌కు చెందిన బాలీవుడ్.ఏఐ, హాలీవుడ్‌.ఏఐ సంస్థలు తనకు రూ.7 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అని ఊర్వశీ రౌటేలా డిమాండ్‌ చేసింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వినియోగించుకున్నారు అనేది ఆమె ఆరోపణ. తాను చెప్పని మాటల్ని చెప్పినట్లుగా వీడియోలను రూపొందించారు అనేది ఆమె వాదన. దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమై.. ఆమె ఈ మేరకు కామెంట్లు చేసింది.

మీ ఏఐ కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోండి. అంతేకానీ అనుమతి లేకుండా ఊర్వశీ పేరును మీ వ్యాపారంలోకి లాగొద్దు అని సోషల్‌ మీడియా వేదికగా సంస్థకు ఆమె టీమ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రూ.7 వేల కోట్లు నష్టపరిహారం చెల్లించండి అని కూడా చెప్పింది. దీనిపై ఆయా సంస్థల యజమాని షిరాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. ఊర్వశి అనని మాటలను అన్నట్లుగా తాము వీడియోలో పెట్టలేదని క్లారిటీ ఇచ్చింది. ఆమె నష్ట పరిహార డిమాండ్‌ సరికాదు అని తేల్చి చెప్పింది.

వినోద రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వెండితెరపై ఏఐ అద్భుతాలు సృష్టించనుంది అంటూ చెప్పే ప్రయత్నం చేశారు షీరాజ్‌. అక్కడితో ఆయన ఆగకుండా దయచేసి ఈ మార్పును స్వీకరించండి అని ఆయన అన్నారు. ఊర్వశి మాట్లలో ఈ ఏఐ వల్ల బాలీవుడ్ ఇబ్బందిపడుతోంది అనే మాట ఉంది. ఆమె మాటలు చూస్తుంటే.. దానికి షిరాజ్‌ రియాక్షన్‌ చూస్తుంటే.. ఎందుకో లేనిపోని చర్చకు రెడీ అవుతున్నారు అనిపిస్తోంది.

 అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus