వక్కంతం వంశీ సినిమా అంటే… ఓ తెలియని ‘కిక్’ ఉంటుంది. ఆయన సినిమా కథ ‘రేసుగుర్రం’లా పరిగెడుతుంది. ఆయన కథలో హీరో ‘కత్త’లా ఉంటాడు. సినిమా ‘ఊసరవెళ్లి’లా రంగులు మారుస్తూ ప్రేక్షకుడికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ మాటల్లో ‘టెంపర్’కి ‘ఎవడు’ అయినా వావ్ అనాల్సిందే. ‘ఆరడగుల బుల్లెట్’ లాంటి పదునైన సంభాషణలు కూడా ఉంటాయి. ‘టచ్ చేసి చూస్తే’ హీట్ అదిరిపోతుంది సినిమా కథ. మొత్తంగా చెప్పాలంటే ఆయన మాస్ మసాలా యాక్షన్ సినిమాకు ‘ఏజెంట్’. అయితే వీటితోపాటు మరొకటి ఉంది. అదే ఆయన దర్శకుడిగా సినిమా స్టార్ట్ చేస్తే అదంత ఈజీగా సాగదు.
ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గతంలో ఏమైందో ఓసారి చూద్దాం. రైటర్‌గా వక్కంతం వంశీ స్టార్ హీరోలకు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలామంది హీరోలు వంశీ డైరక్షన్లో నటిస్తారని వార్తలొచ్చాయి. అందులో ఎక్కువగా వినిపించిన పేరు ఎన్టీఆర్. అయితే ఏమైందో ఏమో చాలా సార్లు ఇదిగో, అదిగో అంటూ ఆఖరికి తారక్ వంశీకి సినిమా చేయలేదు. దీంతో వెయిట్ చేసీ చేసీ అల్లు అర్జున్‌తో సినిమా చేశాడు. అదే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.
ఆ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే మనకు, బన్నీ ఫ్యాన్స్‌కి అంత మంచిది. ఎందుకంటే ఆ సినిమా తర్వాత బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకొని అంతా సెట్‌రైట్ చేసుకున్నాడు. దీని తర్వాత వంశీ రైటర్‌గా మారిపోయి వరుస సినిమా చేశారు. ఇప్పుడు మళ్లీ డైరక్షన్లోకి వస్తూ నితిన్‌తో సినిమా స్టార్ట్ చేశారు. శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి అంతా ఓకే కాదు అని అంటున్నారు.
నితిన్ (Nithiin) సినిమా సెట్ అయి రెండేళ్లు కావస్తోంది. ఇక షూటింగ్ మొదలై చాలా నెలలు దాటుతోంది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది పరిస్థితి అంటున్నారు. దీంతో నితిన్, వంశీకి ఎక్కడో సెట్ కావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగడం లేదు అంటున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ఆగిందని, మూడో వారంలో మళ్లీ మొదలవుతుందని అంటున్నారు.