శివగామి పాత్ర శ్రీదేవి చేసి ఉంటే ఎలా ఉండేది ?
- May 11, 2017 / 10:32 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమాలో బాహుబలి, భల్లాల దేవా, కట్టప్ప తో సమానంగా పేరు దక్కించున్న రోల్ శివగామి. రాజమాత క్యారక్టర్ సినిమాలో కీలకం. ఆ పాత్రలో రమ్యకృష్ణ అత్యద్భుతంగా నటించి అదరగొట్టారు. అయితే రాజమౌళి ఈ పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. ఆమె కాదనడంతో రమ్యకృష్ణకు వచ్చింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ పేరు సంపాదించేదని కామెంట్ చేశారు. అతని మాటకు శ్రీదేవి ఫ్యాన్స్ అంగీకరిస్తారేమో ఇంకెవరూ ఒప్పుకోవడం లేదు. దీనిపై ఫిలిం నగర్లో పెద్ద చర్చే జరుగుతోంది.
శ్రీదేవి అప్పట్లో అతిలోక సుందరి కావచ్చు. ఇప్పుడు గ్లామర్ తగ్గింది. పైగా సుకుమారంగా మాట్లాడే ఆమె “కట్టప్ప .. మహిష్మతికి మకిలి పట్టింది.. రక్తంతో కడిగేసేయ్” వంటి రౌద్ర పూరిత డైలాగులను చెప్పడం అసాధ్యమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ గాంభీర్యం, రాజసం శ్రీదేవి వల్ల కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఒప్పుకోకపోవడం బాహుబలికి వరమైందని చెప్పేవారు లేకపోలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













