బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఆట రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ డే నామినేషన్స్ తర్వాత జెస్సీకి ఆరోగ్యం సరిగ్గా లేక ఇంటి నుంచీ బయటకి వచ్చేశాడు. అయితే, డాక్టర్స్ తనకి ఎలాంటి ప్రమాదం లేదని, అన్ని టెస్టులు చేశామని క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ జెస్సీని సీక్రెట్ రూమ్ లో ఉంచి, క్వారైంటైన్ అవ్వగానే తిరిగి హౌస్ లోకి పంపించాలని డిసైడ్ అయ్యారు. అయితే, అనూహ్యంగా జెస్సీకి మరోసారి తన హెల్త్ కండీషన్ దెబ్బతిన్నది. లక్షణాలు మారుతూ వచ్చాయి.
ఒకవైపు అంతా భారంగా ఉందని, పడిపోతున్నట్లుగా అనిపిస్తోందని, అంతేకాకుండా కాళ్లు చేతులు బాగా వాచినట్లుగా కూడా అవుతోందని డాక్టర్ కి జెస్సీ చెప్పాడు. ఇలా గతంలో నాకు ఎప్పుడూ అవ్వలేదని చెప్పి జెస్సీ సరికొత్త లక్షణాలు చెప్పేసరికి, అందుకు తగ్గట్లుగా జెస్సీకి ట్రీట్మెంట్ ఇస్తామని, స్పెషలిస్ట్ లు కూడా వచ్చి చూస్తారని జెస్సీకి భరోసా ఇచ్చాడు డాక్టర్. అయితే, ఇప్పుడు ఈవారం జెస్సీ ఆరోగ్యపరిస్థితులు కారణంగా ఇంటి నుంచీ వెళ్లిపోతే నామినేషన్స్ లోకి వచ్చినవారి పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఒకవేళ జెస్సీని ఎలిమినేట్ చేస్తే ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి.
జెస్సీ ఆటలో ముందుకు వెళ్తాడా.. లేదా బిగ్ బాస్ హౌస్ నుంచీ ఇంటికి వెళ్తాడా అనేది వీకండ్ నాగార్జున ఎపిసోడ్ లో డిసైడ్ అయిపోతుంది. ఇక మరోవైపు ఓటింగ్ లో చూసినట్లయితే, కాజల్ ఇంకా మానస్ ఇద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈవారం ఒకవేళ ఎలిమినేషన్ జరిగినట్లయితే వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ప్రతి సైట్ లోనూ కాజల్ ఓటింగ్ లో లీస్ట్ లో కనిపిస్తోంది. జెస్సీని వీకండ్ ఎలిమినేట్ చేస్తే కాజల్ బచాయించినట్లే లెక్క. ఒకవేళ హెల్త్ కండీషన్ మెరుగుపడి బిగ్ బాస్ హౌస్ లోకి జెస్సీ వస్తే, ఈవారం తో కాజల్ గేమ్ అయిపోయినట్లే. అదీ మేటర్.