మహేష్ స్పైడర్ స్టోరీపై చర్చ!

  • May 27, 2017 / 08:25 AM IST

మహేష్, మురుగదాస్ కలయికలో మూవీ పట్టాలెక్కిన వద్ద నుంచి ఆయన అభిమానులతో పాటు ఫిలిం నగర్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ లో మహేష్ ఎంటర్ మూవీ కావడంతో దీనిపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ మధ్య టైటిల్ ని బట్టి సినిమా ఎలా ఉందో అంచనా వేసే సినీ విశ్లేషకులు మహేష్ మూవీ విషయంలో తలపట్టుకు కూర్చుంటున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్నారు.. అనే ఒక విషయం తప్పించి మురుగదాస్ బృందం ఏ క్యారక్టర్ గురించి బయటికి లీక్ చేయలేదు.

స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా.. ఆ అవకాశం ఎవరికీ దొరకడం లేదు. స్పైడర్ ఫస్ట్ లుక్ కథని ఒక ముక్క కూడా రివీల్ చేయలేదు. దీంతో స్పైడర్ పై క్యూరియాసిటీ పెరిగింది. ఈ అంశంపై ఫిలిం నగర్లో మాట్లాడుకునే వారు పెరిగారు. అందుకే అందరూ 31 వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆరోజు స్పైడర్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఆ టీజర్ ద్వారానైనా కథని అంచనా వేసేందుకు, తెలుసుకునేందుకు అటు తమిళనాడు, ఇటు రెండు తెలుగురాష్ట్రాల్లో కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus