బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి నటించింది సారా. షూటింగ్ సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అవి కేవలం పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఆ తరువాత కార్తీక్ ఆర్యన్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు కథనాలు ప్రచురించాయి.
అయితే ఈ వార్తలపై సారా కానీ కార్తీక్ ఆర్యన్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ బ్యూటీ మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కేదార్ నాథ్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన జెహన్ హండాతో ఆమె ప్రేమలో పడిందని బీటౌన్ టాక్. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. సముద్ర తీరాన జెహన్ హండాతో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఐలవ్యూ.. నన్ను మళ్లీ అక్కడకు తీసుకెళ్లిపో’ అంటూ రాసుకొచ్చింది.
ఈ ఫోటోలో వీరిద్దరూ ఆరెంజ్ కలర్ డ్రెస్ లు వేసుకొని కనిపించారు. సారా.. జెహన్ పై వాలిపోయి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇదిలా ఉండగా.. గతేడాది సారా పుట్టినరోజు నాడు జెహన్ ఆమెకి విషెస్ చెబుతూ.. మన స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలను ఎవరూ మార్చలేరని.. నేనెప్పటికీ నీతోనే ఉంటా అంటూ పోస్ట్ పెట్టాడు. ఇదంతా చూస్తుంటే సారా ప్రేమలో పడిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!