Prabhas, Nag Ashwin: మైల్‌స్టోన్‌ కోసం కావాలనే ప్రభాస్‌ అలా చేస్తున్నాడా…

  • July 2, 2021 / 12:11 PM IST

వైజయంతి మూవీస్‌ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ సినిమా ఘనంగా ప్రకటించారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్‌ జరిగి 17 నెలలు అవుతుందనే విషయం మీకు గుర్తుందా. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ మరికొన్ని సినిమాలు ఓకే చేసుకొని పట్టాలెక్కించాడు కూడా. కానీ నాగ్‌ అశ్విన్‌ సినిమా మాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా ఆ సినిమా కెమెరా మ్యాన్‌ డేనీ సాంచెజ్‌ లోపెజ్‌ చేసిన ఓ పోస్టు చూస్తే… ఆ ప్రెస్టీజియస్‌ మూవీ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ప్రభాస్‌ సినిమాలు ఇప్పటివరకు చేసినవి, షూటింగ్‌లో ఉన్నవి చూసుకుంటే మొత్తంగా 22 (కేమియో తీసేస్తే). 22వ సినిమా ‘ఆదిపురుష్‌’. ఆ లెక్కన ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా 23వది అవ్వాలి. కానీ డేనీ చేసిన సోషల్‌ మీడియా పోస్టులో #PRABHAS25 అని ట్యాగ్‌ చేశాడు. దీంతో నాగ్‌అశ్విన్‌ సినిమా ఇంత త్వరగా మొదలవ్వదా అనే డౌట్ మొదలైంది. నాగ్‌అశ్విన్‌ సినిమా 25 అయితే… 23, 24వ సినిమాలేంటో మరి.

ఒకవేళ నాగ్‌అశ్విన్‌ సినిమా సీరియల్‌ నెంబరు 25 అయితే… ఆ 23, 24 సినిమాలు చేసే దర్శకులు ఎవరు అనేది ఇక్కడ పాయింట్‌. లేదు గతంలో చేసిన కేమియోలను కలిపేస్తే… నాగ్‌అశ్విన్‌ సినిమా 25 అవుతుంది. అయితే ప్రభాస్ ఇప్పటివరకు ‘యాక్షన్‌ జాక్సన్’, ‘దేనికైనా రెడీ’ సినిమాలలో కేమియోలు చేశారు. అయితే ‘దేనికైనా రెడీ’లో కేవలం వాయిస్ ఓవర్‌ ఇచ్చాడు. దీంతో నాగ్‌అశ్విన్‌ సినిమా 25వది ఎలా అవుతుందనేది తెలియడం లేదు. నాగ్‌అశ్వినే దీనికి క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus