RRR… ఎన్టీఆర్‌ కొత్త డేట్‌ మోసుకొస్తాడా?

  • May 18, 2021 / 12:28 PM IST

మరో రెండు రోజుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు రాబోతోంది. ఆ రోజు కచ్చితంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి పోస్టరో, వీడియోనో ఏదో ఒకటి రిలీజ్‌ చేస్తారు. దీని గురించి ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, బయటి ప్రేక్షకులు కూడా అంతగానే ఎదురుచూస్తున్నారు. ఆ మాటకొస్తే దేశం మొత్తం ఎదురుచూస్తోందనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఆ పోస్టర్‌/వీడియోతో సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వస్తుందేమో అని. అర్థమైందిగా ఎందుకు ఆ ఎదురుచూపులో…

ముందుగా అనుకున్న ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఆక్టోబరు 13న విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రధాన పాత్రధారులు వరుసగా కరోనా బారిన పడటం, ఆపై వచ్చిన కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా సినిమా చిత్రీకరణ అనుకున్నట్లుగా జరగలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా అలానే సాగింది. దీంతో సినిమా అనుకున్న సమయానికి రాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వాయిదా విషయాన్ని చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదనే విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌ బర్త్‌ డే స్పెషల్‌గా ఇప్పుడు పోస్టర్‌/ వీడియో వస్తుండటంతో అందులో సినిమా తేదీ ఏమన్నా ప్రకటిస్తారా అనేది ప్రేక్షకుల ఆలోచన. అయితే సినిమా వాయిదాని జక్కన్న ఇలా వేరే పోస్టర్లతో కలిపి చెబుతాడా? అంటే కాదు అనే సమాధనమే వస్తోంది. దానికంటూ ప్రత్యేక సమయం, పోస్టు ఉంటుందంటున్నారు. పుట్టిన రోజునాడు ఫ్యాన్స్‌కు లుక్‌తో ఆనందాన్నిచ్చి… తేదీని మార్చిన న్యూస్‌తో చేదు ఇవ్వడు. అయితే ఈ పోస్టర్‌లో పాత డేట్‌ ఉంటే వాయిదా లేనట్లు, ఏ డేట్‌ లేకపోతే వాయిదా ఖాయం అని అనుకోవచ్చు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus