బిగ్ బాస్4: అడవిలో అంతిమ పోరాటం..!

  • October 30, 2020 / 03:53 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షోకి తాత్కాలింగా బ్రేక్ ఇచ్చిన నాగార్జున మళ్లీ తిరిగి ఎప్పుడు వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి వైల్డ్ డాగ్ షూటింగ్ కి హిమాలయాల్లో షెడ్యూల్ 25రోజులు మాత్రమే. కానీ ఇప్పుడు దీన్ని పొడిగించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, నాగార్జున తన టీమ్ తో కలిసి అడవుల్లో పోరాటం ప్రారంభించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సీజన్ 3 బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీరైజా కూడా ఉంటడంతో బిగ్ బాస్ లవర్స్ ఈ ఫోటోలని తెగ షేర్లు చేసేస్తున్నారు.

సోలోమాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్ విజయ్ వర్మ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు కింగ్ నాగ్. ఈ సినిమా కరోనా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా టైమ్ లో షూటింగ్ కి అనుమతులు ఇచ్చిన సందర్భంగా దూరంగా అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అక్కడే కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలని షూట్ చేశారట. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ హిమాలయాల్లో పర్వతాల్లో కూడా ప్లాన్ చేశారు. అయితే, ఇక్కడ మంచు ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందని మరో రెండు మూడు వారాలు షూటింగ్ ని పొడిగించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

అందుకే, అనుకున్న దానికంటే రెండు మూడు వారాల తర్వాతే బిగ్ బాస్ టీమ్ తో నాగార్జున జాయిన్ అవుతాడని అంటున్నారు. అంటే గ్రాండ్ ఫినాలేకంటే ముందు నాగ్ బిగ్ బాస్ టీమ్ తో జాయిన్ అవుతాడు అన్నమాట. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి కాబట్టి , నవంబర్ నెలాఖరు ఎపిసోడ్ లో నాగ్ తిరిగి బిగ్ బాస్ సెట్స్ పైకి వచ్చినా వచ్చినట్లే అని అంటున్నారు అందరూ. మరి అప్పటి వరకూ అక్కినేని కోడలుపిల్ల సమంత షోని రన్ చేస్తుందా, లేదా వేరే ఎవరినైనా రప్పించి షోని రన్ చేయిస్తారా అనేది ఆసక్తికరం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus