రామ్‌చరణ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. ఈ విషయం ఇటీవల అనధికారికంగా చరణ్ టీమ్ నుండి వచ్చింది. ఆయన సినిమా వ్యవహారాలు చూస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ వ్యక్తి దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. దీంతో ఇక గౌతమ్‌తో చరణ్ సినిమా లేదు అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అంతేకాదు ఈ లెక్కన చరణ్ నెక్స్ట్ సినిమా సుకుమార్‌తోనే అనే లెక్క కూడా వేసేస్తున్నారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదురు. శంకర్ ఇప్పుడు ‘ఇండియన్ 2’, చరణ్ – దిల్ రాజు సినిమా అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సమ్మర్‌కి వెళ్తుంది అనుకున్నా.. అది ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. కాబట్టి చరణ్ ఖాళీ అవ్వాలి అంటే వచ్చే దసరా వచ్చేస్తుంది అంటున్నారు.
అయితే అప్పటికి సుకుమార్ సిద్ధమవ్వాలి. ‘పుష్ప 2’ పనులు జరుగుతున్న వేగం చూస్తుంటే.. సుకుమార్ ఎప్పటికి సిద్ధమవుతారు అనే విషయంఓ క్లారిటీ రావడం లేదు.
‘పుష్ప 2’ వచ్చే ఏడాది ఆఖరు అంటే 2023లో తీసుకొస్తారు అనే టాక్ నడుస్తోంది. ఆ సినిమా తర్వాత సుకుమార్ కొద్ది రోజులు వెకేషన్‌కి వెళ్తారు అని కూడా అంటున్నారు. ఆ లెక్కన సుకుమార్ ఖాళీ అవ్వాలి అంటే 2024 అవుతుంది. అప్పుడు కూర్చుని కథ రాసుకొని, రెడీ అవ్వాలి. కాబట్టి 2024 ఏ ఆఖరుకో సుకుమార్ రెడీ అవుతారు చరణ్ సినిమాకు. అయితే ఇక్కడో విషయం ఉంది. ఆ మధ్య రాజమౌళి మాట్లాడుతూ చరణ్ సినిమా గురించి సుకుమార్ తనతో ఓ సీన్ చెప్పారని, వినగానే అద్భుతంగా ఉంది అనిపించింది
అని జక్కన్న చెప్పారు. ఆ లెక్కన కథ ఇప్పటికే రెడీ అయిపోయింది, దానికి సీన్స్ వెర్షన్ కూడా రెడీ అన్నమాట. మరి ఆ కథతోనే సినిమా చేస్తే వెంటనే మొదలెట్టేయొచ్చు. లేదంటే మార్పులు చేసి ఆలస్యమవ్వొచ్చు. ఈలోపు చరణ్ వేరే దర్శకుడితో సినిమా చేస్తారేమో చూడాలి. ఆ మధ్య కొంతమంది తమిళ దర్శకులు చరణ్‌కు కథ చెప్పారని వార్తలొచ్చాయి. లోకేశ్ కనగరాజ్, జయం మోహన్‌రాజా లాంటి పేర్లు గతంలో వినిపించిన విషయం తెలిసిందే. మోహన్ రాజాది అయితే ‘ధృవ 2’ అవుతుంది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!