‘అర్జున్ సురవరం’ ఆచూకీ ఎక్కడ?

  • July 31, 2019 / 06:54 PM IST

పాపం నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా పరిస్థితి ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. ఎప్పుడో మార్చి 28 న విడుదల చేస్తాం అన్నారు. ఆ తరువాత మే 1 న అన్నారు. కానీ ఓ పక్క ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ మరోపక్క ‘మహర్షి’ వంటి పెద్ద సినిమాలు ఉండడంతో వాయిదా వేస్తున్నాం అన్నారు. అయితే ఆ ‘మహర్షి’ వచ్చి వెళ్ళి రెండు నెలలు దాటేసింది. మధ్యలో చిన్న చిన్న సినిమాలు తప్ప మరే పెద్ద సినిమా రాలేదు. అయినా ఈ చిత్రం ఎందుకు విడుదల కాలేదు అనే విషయం పై పెద్ద చర్చ జరిగింది.

ఆగష్టు 2 వ వారంలో లేదా 3 వ వారం… అలాగే ‘సాహో’ తో పాటు రిలీజ్ అంటున్నారు. ఇదైనా కన్ఫార్మా అంటే అదికూడా చెప్పలేం అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ఇక నిఖిల్ నెక్స్ట్ సినిమాల గురించి కూడా పెద్దగా అప్డేట్స్ ఏమీ రావట్లేదు. ‘కార్తికేయ 2’ ఉంటుందన్నారు. ఇప్పుడు దాని ఊసే లేదు. ‘ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలని తొక్కేస్తారు… అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ నిఖిల్ ను కూడా తొక్కేస్తున్నారా? మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తూ ఎదుగుతూ వస్తున్నాడు నిఖిల్. ‘హ్యాపీ డేస్’ బ్యాచ్ లో ఒక్క తమన్నా, నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ నిలదొక్కుకోలేదు. మరి అసలు విషయం ఏంటి అనేది అర్ధం కాని ప్రశ్న. ఇక ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని టి.ఎన్ సంతోష్ డైరెక్ట్ చేస్తుండగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus