సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెడితే వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కు మాత్రం అందం, అభినయం ఉన్నా అదృష్టం మాత్రం కలిసిరాలేదు. కొమరం పులి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ మూవీ తరువాత నికిషాకు చిన్న సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి.
కన్నడ, తమిళ భాషల్లోని సినిమాల్లో నటించిన నికిషాకు ఆ ఇండస్ట్రీల్లో నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో నికిషా చివరగా అరకు రోడ్ లో అనే సినిమాలో నటించారు. 2016 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బ్రిటన్ లో రెగర్ మేనేజ్మెంట్ లో పని చేస్తున్నారని సమాచారం. అయితే వయస్సు పెరుగుతున్నా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఆశ పడుతున్న ఈ హీరోయిన్ ఒక మంచి మూవీతో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు నికిషా పటేల్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నికిషా పటేల్ ప్రయత్నిస్తున్నారు. 2006 సంవత్సరంలో యూకేలో మిస్ వేల్స్ పోటీలో నికిషా పటేల్ ఫైనలిస్ట్ గా నిలిచారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గతంలో నికిషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రంగాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ సినిమా రంగంలోనే ఎక్కువగా హైలెట్ అవుతుందని ఆమె వెల్లడించారు. రీఎంట్రీలోనైనా పవన్ హీరోయిన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటారేమో చూడాల్సి ఉంది.