బెంగాల్ టైగర్ చిత్రం విడుదల అయిన తరువాత మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం ఎటువంటి చిత్రాల్లోనూ నటించడం లేదు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకో వలసి ఉండగా.. రెమ్యునేషన్ విషయంలో హీరో, నిర్మాతల మధ్య విభేదాలు రావడం తో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. నూతన దర్శకుడు చక్రి సారధ్యంలో డీవీవీ దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించనుండగా..
ఈ చిత్రంలో రాశి ఖన్నా, రవితేజ జంటగా నటించాల్సి ఉండగా ఈ చిత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తమిళంలో హిట్ కొట్టిన కనితాన్ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తుండగా ఈ రీమేక్ లో రవితేజ నటించనున్నట్లు.. చిత్ర దర్శకుడు టీఎన్ సంతోష్ తెలిపాడు. ఈ రెండు చిత్రాల్లో రవితేజ ఎవరితో మొదట నటించనున్నాడన్న విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం మొదట సెట్స్ పైకి వెళ్లనుందో వేచిచూడాలి.