ప్రేక్షుకులకు ప్రశ్నను మిగిల్చిన బాహుబలి 2
- April 29, 2017 / 11:11 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ అభిమానులకు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నను మిగిల్చింది. ఇందుకు నిన్న విడుదలయిన బాహుబలి 2 లో సమాధానం దొరికింది. ప్రేక్షకులందరూ రాజమౌళి ఇచ్చిన సమాధానానికి సంతృప్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని మరో ప్రశ్న వెంటాడుతోంది. అదే భల్లాల దేవుడి భార్య ఎవరు? ‘బాహుబలి: ది బిగినింగ్’లో భళ్లాలదేవుడికి కొడుకు భద్ర ఉన్నట్టు చూపించారు. ఆ భద్ర కూడా తండ్రి లాగే దేవ సేనను హింసిస్తాడు.
అతని చేష్టలు భరించలేక శివుడు అతని తలని నరికేస్తాడు. ఆ పాత్రలో అడవి శేషు చక్కగా నటించాడు. రెండో పార్ట్ లో భద్ర తలతో దేవసేన మహిష్మతి రాజ్యంలోకి వస్తుంది. అయితే కంక్లూజన్ లో భద్ర తల్లిని, భళ్లాలదేవుడి భార్యను చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఒక సీన్ లో కూడా ఆమె ప్రస్తావన రాలేదు. కనీసం పేరు కూడా తెలియకపోవడం ప్రేక్షకులకు నిరాశని మిగిల్చింది. ఈ ప్రశ్నకు రాజమౌళి మీడియా ద్వారానైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












