Sonam Kapoor: అమ్మాయి డ్రెస్‌ వేసుకున్న ఆ అబ్బాయి ఎవరబ్బా!

  • June 18, 2022 / 01:58 PM IST

బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌ సీమంతం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించి రెండు రకాల అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి ఆ ఫొటోలో సోనమ్‌ కపూర్‌ ఫేస్‌ చాలా మారిపోగా, ఆమెతో పాటు ఉన్న వ్యక్తి విచిత్రంగా ఉండటం. అబ్బాయి అయినా అమ్మాయి వేషధారణలో ఉండటంతో ఆ ఫొటోలను తెగ వైరల్‌ చేస్తున్నారు. పనిలో పనిగా ఆ వ్యక్తి ఎవరు అనేది సెర్చ్‌ చేస్తున్నారు. దానికి సమాధానమే ఈ వార్త.

సోనమ్ కపూర్ తరచూ బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. గర్భం ధరించాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యింది సోనమ్‌. తన బిడ్డ కోసం తను, కుటుంబం ఎంతగా వేచి చూస్తోందో ఆ పోస్ట్‌ల్లో చెబుతూ ఉంటుంది. జూనియర్‌ సోనమ్‌ కోసం కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సీమంతం లండన్‌లో నిర్వహించారు. జరిగింది. వెస్ట్రన్ స్టయిల్‌లో బేబీ షవర్ నిర్వహించారు. ఆ ఫొటోను సోనమ్‌, ఆమె స్నేహితులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఆ ఫొటోల్లో సోనమ్‌ పక్కన లియో కళ్యాణ్ అనే సింగర్ ఉన్నాడు. అబ్బాయా ఎక్కడా అని అనుకోవద్దు. ఆ ఫొటోల్లో కనిపిస్తున్న అమ్మాయి లాంటి వ్యక్తి అబ్బాయే. అతనే లియో కళ్యాణ్‌. ఆ కార్యక్రమంలో లియో పాటలు పాడుతూ ఉత్సాహపరిచాడట. అసలు సోనమ్‌ ఫోటోలను షేర్ చేసింది అతనే. అయితే అతని డ్రెస్ చూసి నెటిజనులు షాక్‌ అయ్యాడు. లియో షేర్‌ చేసిన వీడియోల బట్టి చూస్తే ఆయన పాటలకు సోనమ్‌ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ అలనాటి హీరో అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌. స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న రోజుల్లోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను 2018లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus