రహస్య స్నేహితుడి గురించి చెప్పిన శృతి

  • July 2, 2016 / 01:53 PM IST

విశ్వనటుడు కమలహాసన్ నట వారసురాలు శృతి హాసన్. మల్టీ టాలెంటెడ్ గర్ల్. అద్భుతంగా పాడగలదు. హుషారుగా ఆడగలదు. అందంగా నటించగలదు. అంతే కాదు. స్వరాలను కూర్చగలదు. సినిమాలో రాక పూర్వమే పాటల ఆల్బమ్ ను ఈ కోయిల రిలీజ్ చేసింది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటూనే విదేశీ మ్యూజిక్ బ్రాండ్ తో ఆల్బమ్ రిలీజ్ చేయడానికి కష్టపడుతోంది.

ఇలా ఆల్బమ్, సినిమా, ఫ్యాషన్ ట్రెండ్స్ తో నిత్యం వార్తల్లో ఉండే శృతి తాజాగా తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో కెక్కింది. తనకు ఒక రహస్య స్నేహితుడు ఉన్నట్లు దైర్యంగా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య ఇంటర్వ్యూ లో విలేఖరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ సంగీత దర్శకుడని, సూపర్ టాలెంటెడ్ అని  వెల్లడించింది. పేరుమాత్రం చెప్పకుండా అతను తనకి  ఫ్రెండ్ కావడం లక్కీ అని సంబరపడుతోంది. ప్రస్తుతం శృతి యువసామ్రాట్ నాగ చైతన్యతో కలిసి ప్రేమమ్ సినిమాలో, తండ్రి కమల్ మూవీ శభాష్ నాయుడు లో విశ్వనటుడికి కూతురిగా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus