బిగ్‌బాస్ నాలుగో సీజన్… నాలుగో వారం ముగియబోతోంది. అందులో ఏముంది పెద్ద విషయం అంటారా? ప్రతి సీజన్లో నాలుగో వారం చాలా కీలకం అంటుంటారు ఇప్పటివరకు బిగ్‌బాస్‌ను ఎనలైజ్ చేసినవాళ్లు. ఎందుకంటే బిగ్‌బాస్ గేమ్‌లో సీరియస్ ట్విస్ట్‌లు ఐదో వారం నుంచే మొదలుపెడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ప్రైవేటు ఓటింగ్‌ల ప్రకారం చూస్తే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఈ వారం ‘కిల్లర్ కాయిన్స్’ గేమ్ దురదృష్టవంతుడే అని తెలుస్తోంది.
నాలుగో వారంలో కుమార్ సాయి, మెహబూబ్, సొహైల్, అభిజిత్, హారిక, స్వాతి దీక్షిత్, లాస్య నామినేషన్లో ఉన్నారు. ఇక ఎప్పటిలాగే అభిజీత్‌కు అత్యధిక శాతం ఓట్లు సాధించి తొలి సేఫ్ అవుతాడని అంటున్నారు. హారిక, లాస్య, కుమార్ సాయి తర్వాత స్థానాల్లో ఉన్నారట. గత వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న మెహబూబ్ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడట. నిజానికి స్వాతి దీక్షిత్, సోహైల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇప్పుడే ఇంటికి వచ్చిందనే సింపథీ స్వాతి దీక్షిత్‌ను కాపాడందని సమాచారం.
కిల్లర్ కాయిన్స్ టాస్క్‌లో బాగా కష్టపడిన సోహైల్ మీద కూడా బిగ్‌బాస్ వ్యూయర్స్ కాస్త చల్లని చూపు చూశారట. దీంతో అతను తప్పించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉండబోతుందనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ బిగ్‌బాస్ ఇద్దరిని ఈ రోజు ఇంటి నుంచి బయటకు పంపించాలనే ఆలోచన చేస్తే… అప్పుడు సోహైల్ మీద కూడా వేటు పడుతుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఇంటిని వీడనున్నారు.