మంజిమా మోహన్..టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. నాగ చైతన్య- గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు మాత్రం చార్ట్ బస్టర్ అనే చెప్పాలి. అలాగే మంజిమా నటన కూడా హైలెట్ గా నిలిచింది. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్రలో అంటే రానా(చంద్రబాబు ) భార్య పాత్రలో ఈమె నటించింది.
తమిళ, మలయాళంలో మాత్రం ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కడలి హీరో గౌతమ్ కార్తీక్ తో ఈమె ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇతను సీనియర్ హీరో కార్తీక్ తనయుడు అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం గౌతమ్ – మంజిమ ల మధ్య ప్రేమ చిగురించింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ పాత పోస్టులు డిలీట్ చేసింది. దీంతో పెద్ద చర్చ మొదలైంది. రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఆమె కాసేపు ఈ ఊహాగానాలు ఎంజాయ్ చేసి అసలు మేటర్ బయట పెట్టింది. తన చేదు జ్ఞాపకాలను చెరిపేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అనే ఉద్దేశంతోనే పాత ఫోటోలను డిలీట్ చేసినట్టు ఈమె తెలిపింది.