టాలీవుడ్ లో మెగాస్టార్ తో భారీ సినిమాలు నిర్మించి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గుర్తున్నారా….ఒకప్పుడు బడా నిర్మాతగా దూసుకుపోయిన ఆయన అటుపై తన కుమార్తె నిర్మాణంలో సహకరిస్తున్నారు. తాజాగా ఈ నిర్మాత కుమార్తె ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సినిమా దర్సకున్ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఆ ప్రేమ వ్యవహారానికి అశ్వినీ దత్ ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తన అల్లుడు తెలుగు తెరపై చెరగని ఓ సంతకంగా అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ తో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇక దానికి నిర్మాతగా అశ్వనిదత్ సపోర్ట్ కూడా చేస్తున్నాడు. సినిమా పేరును ‘మహానటి’గా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఎలా ఉన్నా…అసలు కధ ఇప్పుడే మొదలయింది…ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా ల డేట్స్ కోసం చూస్తున్నారంట. అదే క్రమంలో మహానటిగా చేసేందుకు మన సౌత్ హీరోయిన్స్ పనికిరారా??
అని కొందరు అంటుంటే, మరికొందరేమో, సౌత్ బ్యూటీస్ తో చేసే అది ఎంత అద్భుతంగా ఉన్నా చూసిన మొహాలే కాబట్టి కొత్తగా అనిపించదు. అదీగాక తెలుగు, తమిళ, హింది భాషల్లో నిర్మించే ఈ సినిమాకు అక్కడ వారు లీడ్ రోల్ అయితేనే మంచిదని చెబుతున్నారు. మరి దీనిపై ఫైనల్ నిర్ణయం మెగా ప్రొడ్యూసర్ అల్లుడుదే కనుక చూద్దాం ఎవరిని ఎంపిక చేస్తారో.