బిగ్ బాస్ కి తనీష్ మీద ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్

Advertisement

ఫస్ట్ సీజన్ అంత బాగోలేదు, ఇదివరకు సీజన్ అంత ఫన్నీగా కానీ కనెక్టింగ్ గా కానీ షో నడవడం లేదని కంప్లైంట్ చేస్తూనే “బిగ్ బాస్ 2″ని భీభత్సంగా ఆదరిస్తున్నారు. ఆ షో కంటెస్టెంట్స్ కోసం ఆల్రెడీ ఆర్మీలు, నేవీలు నిర్మించేశారు కూడా. తిడుతూనో, పొగుడుతూనో షోను మాత్రం ఎపిసోడ్ కూడా మిస్సవ్వకుండా చూస్తున్నారు. సీజన్ ఎండ్ కి వస్తోంది, మరీ రెండు నెలల్లో సీజన్ 2 ముగియనుంది. దాంతో ఇప్పుడు సెకండ్ సీజన్ విన్నర్ ఎవరా అనే విషయంలో చర్చ మొదలైంది. జనరల్ గా అయితే.. ప్రస్తుతం షోలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న కౌశల్ విన్నర్ అని ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోయారు. బయట అతడికున్న పాపులారిటీ & క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అతడే విన్నర్ అని బిగ్ బాస్ యూనిట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

అయితే.. ఇప్పుడు ఉన్నట్లుండి తనీష్ ను లైమ్ లైట్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క టాస్క్ లో కూడా సరైన పేరు తెచ్చుకోలేకపోయిన తనీష్ ను ఉన్నట్లుంది హైలైట్ చేస్తున్నాడు బిగ్ బాస్. తనీష్ డైరెక్ట్ గానే కాక ఇండైరెక్ట్ గానూ కౌశల్ ను టార్గెట్ చేస్తూ కపటమైన ఆటతో ప్రేక్షకుల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. కానీ.. ఇప్పటివరకూ తనీష్ ను ఎలిమినేట్ చేయడం కాదు కదా కనీసం ఎలిమినేషన్ జోన్ లోకి కూడా తీసుకురాలేదు బిగ్ బాస్. మరి తనీష్ మీద బిగ్ బాస్ కి ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్, కౌశల్ ను అడ్డుకోవడం కోసం తనీష్ ను ఒక ఆయుధంలా వాడుకొంటున్నాడా? అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఆల్రెడీ తనీష్ బయట ఉన్న కౌశల్ ఆర్మీ టార్గెట్ లో ఉన్నాడు. ఒక్కసారి పొరపాటున తనీష్ గనుక ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చాడంటే.. మరో ఆప్షన్ లేకుండా బయటకి పంపించేందుకు రెడీగా ఉన్నారందరూ. చూడాలి మరి నాని ఫ్రెండ్ కాబట్టి తనీష్ కి స్పెషల్ కన్సిడరేషన్ దొరుకుతుందా? లేక నిజంగానే అతడి ఆట అంత అద్భుతంగా ఉందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus