Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

‘పాలు తాగి రొమ్ము గుద్దేవాళ్లకు పుట్టగతులు ఉండవు’ అంటారు పెద్దలు. దీన్ని సినిమా పరిశ్రమకు అన్వయిస్తే.. అవకాశాలు సంపాదించి.. సినిమాలు చేసి.. టాలీవుడ్‌ని నోటికొచ్చింది అంటారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్‌ గురించి గత కొన్నేళ్లుగా సోషల్‌ మీడియాలో, కొంతమంది బాలీవుడ్‌ కథానాయికల ఇంటర్వ్యూల్లో ఈ మాటే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో అలా, టాలీవుడ్‌లో ఇలా, తెలుగు సినిమా పరిశ్రమలో ఇదేంటి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Bollywood Heroines

‘పెద్ది’ సినిమా గురించి జాన్వీ కపూర్‌ చెప్పిన మాటలు గురించి అంటున్నామో అనుకునేరు. ఎందుకంటే టాలీవుడ్‌ మీద బురద వేసిన హీరోయిన్లు గతంలోనూ ఉన్నారు. ఇప్పుడు అందులో ఒకరు మరోసారి టాలీవుడ్‌ సినిమాలపై, కథలపై నోటికొచ్చింది మాట్లాడి.. నానా రచ్చా చేస్తున్నారు. తెలుగు ప్రజల బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడింది. ఆమెనే రాధికా ఆప్టే. తెలుగు సినిమాలో కథలు, పాత్రల గురించి విమర్శలు చేసింది. మేనమామ – మేనకోడలు అంటూ ఏవేవో అనింది.

అంతకుముందు తాప్సి కూడా ఇలానే మాట్లాడింది. తెలుగు సినిమాలో బొడ్డు, నడుము చూపించడం గురించి ఏదేదో మాట్లాడింది. మొన్నీ మధ్య అయితే జాన్వీ కపూర్‌ ఇదే స్టయిల్‌లో మాట్లాడింది. ఆ పాత్రను ఓకే చేయడంలో, అలాంటి సీన్స్‌లో నటించడంలో తన తప్పు లేదు అనేలా మాట్లాడింది. మొత్తం తప్పు ఆ సీన్స్‌ రాసిన, తీసిన వారిదే తప్పు అని చెప్పకనే చెప్పింది. ఏదో అలా జరిగింది అంతే.. ఇకపై ఇలాంటి సినిమాలు చేయను అని చెప్పింది కూడా.

అయితే, పై ముగ్గురు హీరోయిన్లు చెబుతున్నట్లు ఇబ్బందికర సన్నివేశాలు తెలుగు సినిమాల్లో మాత్రమే చేశారా? బాలీవుడ్‌లో చేయలేదా? అనేది ఇక్కడ ప్రశ్న. టాలీవుడ్‌లో వీరు చేసిన స్కిన్ షో, ఎక్స్‌పోజింగ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ చేశారు. ఇక రెమ్యూనరేషన్లు, వసతులు, వసూళ్ల విషయంలో ఇక్కడే ఎక్కువ అందుకున్నారు. స్టార్ స్టేటస్‌ కూడా అందుకున్నది కూడా ఇక్కడే. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్‌ని అనడం ఏరు దాటాక తెప్ప తగలెట్టడం లాంటిదే.

4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus