సాధారణంగా సినిమా హీరోలందరూ తమ కెరీర్ లో కనీసం ఒక్క హ్యాట్రిక్ అయినా ఉండాలని ఆశపడుతుంటారు. అందులో తప్పేం లేదు, కానీ ఒక అది సాధించడం మాత్రం అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్, ఎన్టీయార్, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోస్ అందరూ హ్యాట్రిక్ హిట్స్ అందుకోగలిగారు కానీ.. ఒక్క రామ్ మాత్రం ఇప్పటివరకూ హ్యాట్రిక్ హిట్ అనేది అందుకోలేకపోయాడు. ఒక సినిమా సక్సెస్ అయ్యింది అని సంతోషించేలోపే మరో రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేవి.
“నేను శైలజ”తో సూపర్ హిట్ అందుకొన్న రామ్ ఆ తర్వాత నటించిన “హైపర్” యావరేజ్ గా నిలవగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది. ఇక రీసెంట్ గా రిలీజైన “ఉన్నది ఒకటే జిందగీ” కూడా కేవలం ఒక వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే మెప్పించగలిగింది. మొదటివారం కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించుకోగా.. రెండో వారం సైలెంట్ అయిపోయింది. సో, “ఉన్నది ఒకటే జిందగీ”ని కూడా ఫ్లాప్ గా డిక్లేర్ చేయాల్సిందే. కావున హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకొన్న రామ్ ఆశ నెరవేరాలంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా నుంచి వరుసబెట్టి హిట్లు కొట్టాల్సిందే. అయితే.. ఇప్పటివరకూ రామ్ తదుపరి సినిమా ఏమిటనే విషయంపై క్లారిటీ రాలేదు.