కాజల్ ఎందుకు అలా చేసింది ?

  • July 6, 2016 / 12:05 PM IST

అమెరికాలో గత వారం జరిగిన ఆటా ఉత్సవంలో కాజల్ అగర్వాల్ ని చూసిన వారందరిదీ ఇదే ప్రశ్న. యువరాణిలా ఉండే కాజల్ కొన్ని రోజులుగా తిండి లేని అమ్మాయిలా కనిపించేసరికి వారు షాక్ తిన్నారు. సినిమాల్లో చక్కగానే ఉందిగా.. ఇంకా స్లిమ్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని బాధపడిపోతున్నారు. ఈ ఫొటోలో కాజల్ ని చూస్తే మీరు కూడా అలాగే అంటారు.

గత ఏడాది టెంపర్ సినిమాలో చాలా అందంగా ఆకర్షించింది. ఈ ఏడాది కొంత బరువు తగ్గి సర్దార్ గబ్బర్ సింగ్,  బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. వీటిలో సన్నపడ్డ కాజల్ ని చూసి అభిమానులు కొత్తగా ఫీలయ్యారు. కానీ జీరో సైజ్ లోకి వచ్చిన కాజల్ కి మాత్రం పాస్ మార్కులు కూడా రావడం లేదు. ఈ సంవత్సరం కాజల్ ఆశలు పెట్టుకున్న రెండు తెలుగు సినిమాలతో పాటు, హిందీ చిత్రం కూడా ఫైల్ కావడం ఆమెను తీవ్రంగా బాధించాయని అందుకే ఆమె మరింతగా తగ్గిపోయి ఉంటుందని సినీ వర్గాల వారు భావిసున్నారు.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో తేజ దర్శకత్వం వహించనున్న మూవీ కోసం డేట్స్ కేటాయించింది. ఆ చిత్రం తప్ప ఏ సినిమాకు సైన్ చెయ్యలేదు. ఆమె తమిళంలో నటించిన “కవలై వెండామ్” సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా అయినా కాజల్ బాధను తగ్గిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus