అమ్మకంటే నాన్న ఎందుకో వెనుకబడ్డాడు.. అని తనికెళ్ల భరణి కవిత్వం గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం సోనూసూద్ సహాయలు అందరికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన తరహాలోనే మెగాస్టార్ కూడా అవసరం అయినప్పుడల్లా సహాయలు చేస్తున్నా ఎక్కువగా మీడియాలో హైలెట్ అవ్వడం లేదని టాక్. సేవాగుణంలో సోనూసూద్ ను హైలెట్ చేసినంతగా మెగాస్టార్ ను తెలుగు మీడియా కవర్ చేయట్లేదనే కామెంట్స్ కూడా డైరెక్ట్ గానే వస్తున్నాయి. సోనూసూద్ జనాల్లోకి వెళ్లి మరీ సహాయం చేయడం అందుకు ఒక కారణం అనుకోవచ్చు.
అయితే మెగాస్టార్ కొంతమంది ప్రముఖు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సాధారణ జనాల వరకు వెల్లకపోయినా సినిమా పరిశ్రమలో ఎంతోమంది పేద సినీ కార్మికులకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యం సహాయలు అందుతూనే ఉన్నాయి. ఇక సోనూసూద్ ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం సిద్ధమవ్వగా మెగాస్టార్ అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతి తెలుగు జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ లను సెట్ చేశాడు. అవసరం అయితే ఇంటి వద్దకే ఆక్సిజన్ సిలిండర్ వెళ్ళేలా సహాయలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ తెలుగు మీడియాలో సోనూసూద్ పై వస్తున్న వార్తల కంటే మెగాస్టార్ సేవలపై వస్తున్న అప్డేట్స్ చాలా తక్కువ.
పైగా రామ్ చరణ్ ఆధ్వర్యంలో గ్యాప్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు వెళుతూనే ఉన్నాయి. దీంతో సోనూసూద్ ఎక్కువ రోజులు సహాయలు చేస్తున్నప్పటికీ మెగాస్టార్ సహాయల విలువ ఎందుకో తక్కువగానే చూపిస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఒక విషయం అందరికి అర్ధమయ్యే ఉండాలి. విరాళాలు ఎంత ఇచ్చినా కూడా ఒక్క రోజులో మర్చిపోతారు. పైగా ఆ డబ్బు జనాల వరకు వెళుతుందనే నమ్మకం సగానికి పైగా జనాలు నమ్మడం లేదు. అదే ప్రతి పైసాను జనాల వరకు వెళ్లి ఖర్చు చేసి చూపిస్తే చేసిన దానికి ఒక ఫలితం ఉంటుందని చెప్పవచ్చు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!