Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. దీనిని సినిమాల విషయంలో చూసుకుంటే వయసు ఉండగా, క్రేజ్‌ ఉండగా, బజ్‌ ఉండగా వరుస సినిమాలు చేసేయాలి. వీలైనన్ని ఎక్కువ లాంగ్వేజ్‌ల్లో సినిమాలు చేసి ఫేమ్‌, మనీ సంపాదించాలి. ఈ ఆలోచనలో తప్పేమీ లేదు. అయితే ఒక దగ్గర ఇల్లు చక్కబెట్టుకునే సమయంలో వేరే ఇల్లు ఇబ్బందుల్లో ఉండకూడదు. ఈ మాటను ప్రముఖ కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌ పట్టించుకోవాల్సిన సమయం వచ్చిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.

Mrunal Thakur

ఎందుకంటే వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో కనిపించిన మృణాల్‌ ఠాకూర్‌ ఇప్పుడు తెలుగులో స్లో అయిపోయింది అప్పుడెప్పుడో ఓకే చేసిన ‘డెకాయిట్‌’ సినిమా ఇటీవల విడుదలైంది. ఆ తర్వాత ఆమె ఇంకే తెలుగు సినిమాను ఓకే చేయలేదు. అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా ‘రాకా’లో నటిస్తోంది అని వార్తలొచ్చినా ఎక్కడా స్పష్టత లేదు. దీంతో సరైన సమయాన్ని మృణాల్‌ వృథా చేసుకుంటోంది అనే చర్చ మొదలైంది. అలాగే బాలీవుడ్‌ కోసం టాలీవుడ్‌ని వదులుకుని ఇబ్బంది పడుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది.

‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. ఇది 2022లో జరిగింది. అయితే అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే ఆమె ‘హలో నందన్‌’ సినిమాతో హీరోయిన్‌గా మరాఠీలో అడుగుపెట్టింది. ఆ విషయం పక్కన పెడితే.. ‘సీతా రామం’ తర్వాత ఆమె బాలీవుడ్‌కి వెళ్లి వరుస సినిమాలు చేసింది. అందులో ఏదీ ఆమెకు ఆశించిన విజయం అందించలేదు. ఆ తర్వాత ‘హాయ్‌ నాన్న’ అంటూ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే ‘కల్కి 2898 ఏడీ’, ‘ది ఫ్యామిలీ స్టార్‌’ అంటూ బిజీ అయింది.

కానీ ఆ వెంటనే బాలీవుడ్‌ వెళ్లిపోయి అక్కడే వరు సినిమాలు చేసింది. ‘అలా చేసిన ‘దో దీవానే సెహర్‌ మే’, ‘హే జవానీ తో ఇష్క్‌ హోనా హై’, ‘పూజా మేరీ జాన్‌’తో వచ్చినా ఏదీ విజయం ఇవ్వలేదు. దీంతో మృణాల్ ఇప్పటికైనా తెలుగు సినిమాలు ఓకే చేసి.. స్టార్‌ హీరోయిన్‌ అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరి ఆమె కొత్త కబురు ఎప్పుడు చెబుతుందో చూడాలి.

నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus