Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

నీతి టేలర్‌.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘మేం వయసుకు వచ్చాం’ సినిమా ఫేమ్‌ అంటే ఠక్తున గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రామిసింగ్‌ హీరోయిన్‌ అనే పేరు కూడా తెచ్చుకుంది. ఆ వెంటనే రెండు సినిమాల ఛాన్స్‌లు కూడా సంపాదించింది. అయితే ఆ సినిమాలు అనుకున్న ఫలితాలు ఇవ్వక.. తెలుగు సినిమా పరిశ్రమకు దూరమైంది. టీవీ సీరియల్స్‌, వెబ్‌ షోస్‌, మ్యూజిక్‌ వీడియోలతో బాలీవుడ్‌లో బిజీగా ఉంది.

Niti Taylor

అయితే, గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె మాట్లాడిన ఓ క్లిప్పింగ్ చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఆమె ఆ వీడియోలో ఓ ముసలి తెలుగు దర్శకుడి గురించి మాట్లాడింది. అయితే ఇక్కడ మాట్లాడింది అనే కంటే కెరీర్‌ పూర్తిగా స్మాష్ అయిపోయే కామెంట్లు చేసింది అని చెప్పొచ్చు. తనను ఒక దక్షిణాది దర్శకుడు వేధించిన విషయాన్ని బయటపెట్టింది. దక్షిణాదిలో ఓ సినిమా చేశాక.. ఆ దర్శకుడు కాల్ చేసి, తర్వాతి సినిమాలో అవకాశం ఇస్తానని, కానీ అందుకోసం తన కోరిక తీర్చాలని అడిగాడని నీతి చెప్పింది.

అయితే, ఆమె ఏ దర్శకుడి గురించి ఇలా మాట్లాడింది అని చెప్పలేదు. కానీ ఆమె నటించిన తొలి సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఆ లెక్కన ఆయన మీదే నీతి టేలర్‌ విమర్శలు చేసినట్లు. అయితే ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ ఆ దర్శకుడు ముసలివాడు అని చెప్పింది. అయితే ‘మేం వయసుకు వచ్చాం’ సినిమా సమయానికి త్రినాథరావు నక్కినకు సుమారు 40 ఏళ్లు ఉంటాయి. మరి ఎందుకు ముసలోడు అందో ఆమెకే తెలియాలి.

తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో 2012లో తెలుగులోకి అడుగుపెట్టింది నీతి టేలర్‌. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ హీరోగా రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వంలో ‘పెళ్లిపుస్తకం’ అనే మరో సినిమా చేసింది. ఆ తర్వాత రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో ‘లవ్ డాట్ కామ్’ అనే మరో సినిమా చేసింది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మరోసారి మీడియాలో వైరల్ అయింది నీతి. మరి ఈ ఆరోపణలకు త్రినాథరావు నక్కిన ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

 ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus