‘బెంగళూర్ నాటక్కల్’ లో అతిథి పాత్ర సహా మొన్నటి జనతా గ్యారేజ్ వరకు ఆరు సినిమాలతో తెరమీద సందడి చేసిన సమంత సడెన్ గా కథలు నచ్చితేనే చేస్తా అని సినిమాలకు సెలవంటూ చెప్పకనే చెప్పింది. దీనంతటికీ అసలు కారణం సమంత ప్రేమ కథ అని అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం మూడు ముళ్ళు పడవని ఇరు వర్గాలు బహిర్గతం చేశాయి. పైగా పెళ్లి డేట్ మూడు నెలల ముందు అనౌన్స్ చేస్తానని సామ్ ఇటీవల చెప్పుకొచ్చింది.
ఈ ప్రేమ టాపిక్ ఊపందుకోకముందు సమంత నిర్మాతగా మారుతుందంటూ వార్తలొచ్చాయి. కన్నడ సినిమా ‘యు టర్న్’ సమంత నటిస్తూ నిర్మిస్తుందన్నది ఆ వార్తల సమాహారం. సామ్ సైతం ఈ విషయాన్ని అప్పుతో ధృవీకరించింది. తీరా ప్రేమ ప్రస్తావన వచ్చాక అటు చైతు, ఇటు అత్తవారి కుటుంబంతో షికార్లతోనే సమంత కాలం గడిపేస్తుంది. దాంతో ఈ సినిమాని సమంత అక్కడే వదిలేసి అక్కినేని వారింటి వైపు ‘యు టర్న్’ తీసుకుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోనీ నటనపై అభ్యంతరాలేమైనా ఉన్నాయంటే చైతూ సహా ఆ కుటుంబీకులంతా సమంత ఇష్టమేనని ఓకే డైలాగ్ చెబుతున్నారు. పెళ్లి సంగతి మాట అటుంచి ఈ సినిమా సంగతేంటో సామ్ చెబితే బాగుణ్ణు.