పవన్ పై ఆమెకు ఎందుకు అసూయ ?

  • October 5, 2019 / 04:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అవుతున్నా ఆయన గ్లామర్ లో మార్పు లేదు. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకే ఇప్పటికీ పవన్ కి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్ స్టార్ గ్లామర్ చూసి అతని మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అసూయ పడుతుందంట. ఈ విషయాన్నీఆమె స్వయంగా వెల్లడించింది.

తాను పవన్ ని క్లిక్ మనిపించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి.. “పవన్ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. అందుకే అతని చర్మం చూసి నేను అసూయపడేదాన్ని” అని ట్వీట్ చేసారు. కనుబొమ్మలు ఎగర వేస్తూ ఉన్న పవన్ ఫోటోను ఎడిట్‌చేయలేదని తెలిపారు. పవన్ నిత్యం యోగా చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వలనే ఆయన చర్మం అంత ప్రకాశవంతంగా ఉందని పవర్ స్టార్ గ్లామర్ సీక్రెట్ ని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus