Amara Kavyam: ‘అమర కావ్యం’.. హిందీ వాళ్లకు ఉన్న స్పృహ.. కోలీవుడ్‌ వాళ్లకు లేదా?

తెలుగు సినిమాకు తెలుగు పేరు పెట్టాలి అని మనం గట్టిగా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మన తెలుగువాళ్లే సినిమాలకు తెలుగులో పేర్లు పెట్టడం లేదు. అయితే తెలుగువాళ్లకు అర్థమయ్యేలా, కనీసం తెలుగులో ఓ అర్థం ఉండేలా పేరు పెట్టండి అని అడగొచ్చు. లేదంటే యూనివర్శ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌లో అయినా పేరు పెట్టాలి. ఇంకా లేదంటే ఆ సినిమాలో పాత్ర పేరును సినిమా టైటిల్‌ చేయాలి అని అడిగే అవకాశం ఉంది. ఏమైందో ఏమో కానీ మన వాళ్లు అలా అడుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

Amara Kavyam

ఏమైంది, ఇప్పుడే తమిళ సినిమా తమిళ టైటిల్‌తో వచ్చింది అని అనుకుంటున్నారా? ఇప్పుడేమీ అలాంటి సినిమా రాలేదు కానీ.. ఓ హిందీ సినిమా తెలుగు పేరుతో వస్తోంది. దాంతో మరోసారి తమిళ సినిమా వాళ్లు గత కొన్నేళ్లుగా చేస్తున్న తమిళ టైటిళ్ల బలవంతపు రుద్దుడు కార్యక్రమం గురించి చర్చ మొదలైంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత హీరోగా నటించిన సినిమా ‘తేరే ఇష్క్ మే’. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా మేకర్స్ తెలుగు టైటిల్‌ని ఇటీవల రివీల్ చేశారు. ఈ సినిమాను తెలుగులో ‘అమర కావ్యం’ పేరిట రిలీజ్‌ చేయబోతున్నారు. నవంబర్ 28న సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఇక్కడ విషయం సినిమాకు తెలుగులో ఓ మంచి పేరు పెట్టడమే. మరీ ‘తేరీ ఇస్క్‌ మే’ అని ఇక్కడ రిలీజ్‌ చేయలేరు కాబట్టి పేరు మార్చారు అనొచ్చు కొంతమంది అరవ సినిమా అభిమానులు.

అయితే తమిళ సినిమాలకు, తమిళ పేర్లకు తెలుగులో అర్థాలు ఉన్నా, పర్యాయ పదాలు ఉన్నా తమిళ పేర్లను రుద్దుతున్నారు. వాళ్లు ఇప్పుడు బాలీవుడ్‌ జనాలను కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే సౌత్‌ పరువు తీసుకున్నట్లే.

నార్త్ కోటపై బాలయ్య కన్ను.. ప్లాన్ వర్కౌట్ అయితే భీభత్సమే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus