అతి హైప్ ఒక్కోసారి సినిమాకు అనర్థం అంటారు మన టాలీవుడ్‌లో. ఈ మాట నిజం కాదు అని ఎవరైనా అనుకున్నప్పుడల్లా ఓ సినిమానో, దాని ట్రైలరో లేక టీజరో వచ్చి ఆ మాటను నిజం చేస్తూ ఉంటాయి. రీసెంట్‌గా ఇలాంటివి రెండు ట్రైలర్లు వచ్చాయి. ఒకటి సినిమా టీమ్ ఆలోచనలను ఎండగడితే.. మరొకటి సినిమా మీద ఓవర్ హైప్‌ను తగ్గించేసింది. ఆ సినిమానే ‘ది ప్యారడైజ్’. నాని – శ్రీకాంత్ ఓదెల కలసి ‘దసరా’ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అక్కడే మొదలైంది అసలు సమస్య.
‘ది ప్యారడైజ్’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎప్పుడు మాట్లాడుకున్నా.. ఓ పాజిటివ్ వైబ్ కనిపించేది. సినిమా కోసం నాని, శ్రీకాంత్ పడుతున్న కష్టం గురించి గొప్పగా మాట్లాడారు. అయితే టీజర్‌లో చూపించిన సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. టీమ్ చెబుతున్న ‘మంటెట్టేస్తాం’ స్థాయికి తగ్గట్గుగా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాని వాయిస్ కూడా సినిమాకు యాప్ట్‌గా లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. వాయిస్‌లో బేస్ లేకపోవడం వల్ల డైలాగ్ చెప్పడం కంటే అరుస్తున్నట్లుగా వినిపిస్తోంది.
టీజర్ మొత్తం ‘ఈ నేల ఎవరిది.. ఈ దేశం ఎవరిది’ అనే డైలాగ్ అర్థం కాకుండా కేకలులా ఉంది. ఇక నేపథ్య సంగీతాన్ని అదరగొట్టే అనిరుథ్.. ఎందుకో కానీ మనస్ఫూర్తిగా మ్యూజిక్ ఇవ్వలేదు అనిపిస్తోంది. అయితే సినిమా ప్రపంచాన్ని పరిచయం చేయడంలో మాత్రం టీమ్ సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు, సినిమా ఏ నేపథ్యంలో ఉండబోతోంది అనేది బాగానే చెప్పారు. ఆఖరున మనుషుల గుట్ట మీద బ్లేడులతో కూర్చున్న నాని లుక్, షాట్ మాత్రం అదిరిపోయింది.
ఇలా డబుల్ టాక్‌తో హైప్‌ను తగ్గించిన ఈ సినిమా టీజర్.. సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఎందుకంటే తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్లి బాగుంటే వసూళ్లు ఇంకా పెరుగుతాయి కాబట్టి.