Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్ 4‌: ఊరించి ఉసూరమనిపించినవాళ్లు చాలామంది!

బిగ్‌బాస్ 4‌: ఊరించి ఉసూరమనిపించినవాళ్లు చాలామంది!

  • September 7, 2020 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్ 4‌: ఊరించి ఉసూరమనిపించినవాళ్లు చాలామంది!

మేం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తున్నాం అని ఎవరూ బయటకు నేరుగా చెప్పరు… కానీ షో ప్రారంభానికి ముందే ఆ వివరాలు లీక్‌ అయిపోతూ ఉంటాయి. తెలుగు బిగ్‌బాస్‌ గత మూడు సీజన్లలో ఇదే జరిగింది. 16 మంది కంటెస్టెంట్లు అంటే… ఏ 18 మందో లేక 20 మంది పేర్లు బయటికొచ్చేవి. కానీ ఈ సారి లిస్ట్‌ పెద్దదే బయటకు వచ్చింది.. తీరా చూస్తే చాలా మంది వెళ్లలేదు. మరి వాళ్లు రాలేదా… బిగ్‌బాస్‌ వాళ్లు పిలవలేదా?

తొలి రోజుల్లోనే చెప్పేశారు

బిగ్‌బాస్‌ షో మొదలువుతుంది అని లీకులు రాగానే ‘నేను వెళ్లడం లేదు.. నా పేరు అనవసరంగా ఈ డిస్కషన్‌లోకి లాగకండి’ అంటూ ప్రకటించేసింది హాట్‌ బ్యూటీ శ్రద్ధా దాస్‌. నిజానికి అక్కడ జరిగింది అది కాదంట. ఆమెను బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదించిందిట. అంతేకాదు రెమ్యూనరేషన్‌ విషయంలో పట్టువిడుపులు, లెక్కలు కూడా అయిపోయాయి. అయితే ఆఖరులో భాష సమస్య వచ్చింది ఆమె వెనక్కి వెళ్లిపోయింది అని అంటున్నారు. ఆ తర్వాత బాగా వినిపించిన పేర్లలో తరుణ్‌ ఒకటి. ఇతను కూడా ‘నేను వెళ్లడం లేదు’ అని అఫీషియల్‌ నోట్‌ రిలీజ్‌ చేశాడు. ఇక్కడ కూడా శ్రద్ధా దాస్‌ స్టైల్‌ చర్చలే జరిగాయని అంటున్నారు. అయితే రోజుల విషయంలో జరిగిన చర్చ… చివరికి తరుణ్‌ వెళ్లకుండా ఉండటానికి రూట్‌ వేసిందట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ కల్పిక గణేష్ పేరు కూడా బయటకి వచ్చింది. కానీ, ఎప్పటికీ నేను బిగ్ బాస్ లోకి వెళ్లనూ అంటూ తెగేసి చెప్పేసింది ఆమె.

కపుల్స్‌… ట్రబుల్స్‌

గత బిగ్‌బాస్‌ సీజన్‌లో బాగా హిట్‌ అయిన ఫార్ములా కపుల్స్‌. వరుణ్‌ సందేశ్‌ – వితిక షేర్‌ చేసిన సందడి.. పంచిన వినోదం.. సృష్టించిన మసాలా అంతా ఇంతా కాదు. వాళ్ల రొమాన్స్‌, వితిక అలకలు బాబోయ్‌ అనిపించాయి. ఈసారి కూడా బిగ్‌బాస్‌ టీమ్‌ అలాంటి ఆలోచనే చేసిందని తొలుత వార్తలొచ్చాయి. ఈ సారి కపుల్‌గా డ్యాన్ మాస్టర్‌ & సింగర్‌ డ్యుయో రఘు మాస్టర్‌, ప్రణవిని పంపిస్తారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయాన్ని రఘు మాస్టర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నట్లు గుర్తు. సీన్‌ కట్‌ చేస్తే.. వాళ్లు రాలేదు. వీళ్ల పేర్ల సౌండ్‌ కాస్త తగ్గేసరికి యూట్యూబర్‌ మహాతల్లి పేరు వైరల్‌ అయ్యింది. భర్త సుశాంత్‌తో కలసి మహాతల్లి అలియాస్‌ జాన్వీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెడుతుందని అన్నారు. ఆమెకున్న ఫ్యాన్‌ బేస్‌కి ఈసారి రచ్చ రచ్చే అనుకున్నారు. తీరా చూస్తే ఆమె కూడా కనిపించలేదు.

Singer Noel Sean, Actress Ester Noronha got divorced1

ఇక ఈ ఫ్లోలో వినిపించిన మరో కపుల్‌.. లేటెస్ట్‌ డివోర్స్‌డ్‌ జంట. అవును నోయల్‌ షాన్‌ – ఎస్తర్‌ ఈ సారి బిగ్‌బాస్‌లోకి వస్తారు అని వార్తలొచ్చాయి. దీని మీద వాళ్లు ఎప్పుడూ ఎక్కడ చెప్పనప్పటికీ వార్తలు తిరుగుతూనే ఉన్నాయి. ఈ లోగా ‘మేం విడిపోయాం’ అంటూ వీళ్లు ప్రకటించేసరికి అందరూ షాక్‌. ‘అదేంటి విడాకులా’ అని కొందరు అనుకుంటే.. బిగ్‌బాస్‌ అభిమానులు మాత్రం ‘అంటే వీరిద్దరూ ఇంట్లోకి రారా?’ అని అనుకున్నారు. కట్‌ చేస్తే నోయల్‌ ఒక్కడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

వీళ్లు వైల్డ్‌ కార్డ్‌ అవుతారా?

బిగ్‌బాస్‌లో మజాను రెట్టింపు చేసేది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ. షో నడుస్తున్న సమయంలో వైల్డ్‌ కార్డ్‌ అంటూ కొత్తవారిని తీసుకొస్తుంటాడు పెద్దాయన. అలా ఈసారి కూడా ఒకరిద్దరు ఉన్నారని అంటున్నారు. అలా నందు వస్తాడనీ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నందు డైరక్ట్‌ పార్టిసిపెంట్‌గానే వచ్చేవాడట. అయితే ఉత్సాహం ఆపులోక ‘బిబి’తో సందడి చేసేద్దాం అని ఓ ట్వీటు పెట్టాడు. అదే ఇప్పుడు అతడి రాకకు అడ్డుపడిందనీ అంటున్నారు. అయితే ఆ ట్వీటు తన ‘బ్లాక్‌బస్టర్‌’ సినిమా గురించి అని చెప్పినా బిగ్‌బాస్‌ టీమ్‌ వినలేదని అంటున్నారు. వైల్డ్‌ కార్డ్‌లో చూద్దాం అన్నారని తెలుస్తోంది.

ఇక రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ… ముక్కు అవినాష్‌. ఇతను కూడా డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వాల్సినవాడే. అయితే షో స్టార్ట్‌ దగ్గరపడుతుందనగా అవినాష్‌కు కరోనా సోకిందని సమాచారం. దీంతో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాక లోపలకు పంపిస్తారని అంటున్నారు. క్వారంటైన్‌ టైమ్‌లోనే అవినాష్‌కు కరోనా అని నిర్ధరణ అయ్యిందట. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటే అమ్మాయి లేకుండా కుదరదు కదా. గత సీజన్లలో అదే జరిగింది. అందులో హాట్‌ హాట్‌ భామనే దింపుతారు. ఈ సారి ఆ హాట్‌.. తెలుగు అమ్మాయి స్వాతి దీక్షిత్‌ అంటున్నారు. ఈమె కూడా డైరక్ట్‌ ఎంట్రీ అనుకున్నదే. అయితే వైల్డ్‌ కార్డులోకి వచ్చేసింది. ఎలిమినేషన్‌లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్‌ అయిపోతే… ఇబ్బంది లేకుండా స్వాతి దీక్షిత్‌ను లైన్‌లో పెట్టారట. అయితే వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఉంటుందా అనేది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అనుమానమే.

జబర్దస్త్‌ పేర్లు చాలా…

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు వినించే క్రమంలో ఈసారి ఎక్కువగా ‘జబర్దస్త్‌’ నటీనటుల పేర్లు వినిపించాయి. అయితే వారిలో ఎవరూ బిగ్‌బాస్‌లోకి రాకపోవడం ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. టీవీ హిట్‌ పెయిర్‌ ‘రష్మి – సుడిగాలి సుధీర్‌’ ఈసారి బిగ్‌బాస్‌లోకి రావడం పక్కా అన్నారు. వాళ్లు గనక వస్తే ఆ కెమిస్ట్రీతో షోలో మంచి జోరు కనిపిస్తుంది అనుకున్నారు. అయితే రష్మి షో వదలి రాలేదు.. సుధీర్‌ హీరోగా మరో సినిమా మొదలైంది. యాంకర్‌ విష్ణు ప్రియ పేరు కూడా ఇదే ఫ్లోలో వినిపించింది. ‘ఈటీవీ ప్లస్‌’లో షోస్‌కి బ్రేక్‌ పడటంతో విష్ణు రావడం పక్కా అని అందరూ అనుకున్నారు. చూశారుగా ఆమె కూడా రాలేదు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss 1
  • #Bigg Boss 2
  • #Bigg Boss 3
  • #Bigg Boss 4

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

related news

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

52 mins ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

1 hour ago
The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

3 hours ago
The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

15 hours ago

latest news

The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

12 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

20 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

22 hours ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version