శృతిని టాలీవుడ్ ఎందుకు పట్టించుకోవట్లేదు!

  • April 9, 2016 / 01:46 PM IST

గత ఏడాది ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది శ్రుతి హాసన్. అంతకుముందు ఏడాది ఎవడు.. రేసుగుర్రం లాంటి విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి. అయినప్పటికీ తెలుగులో పెద్ద హీరోల సరసన ఆమెకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓవైపు హీరోయిన్ల కొరత అంటున్నారు. పెద్ద హీరోయిన్లు దొరకడం కష్టం అంటున్నారు. కానీ శ్రుతి మాత్రం తెలుగులో ఏ పెద్ద హీరో సరసనా నటించట్లేదు.
ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న ఏకైక సినిమా ‘ప్రేమమ్’ మాత్రమే. ఇందులో కూడా ఆమె ఒక్కత్తే హీరోయిన్ కాదు. సగం సినిమాలో మాత్రమే కనిపిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో అవగొట్టేసింది శ్రుతి. ప్రస్తుతానికైతే ఆమె చేతిలో ఇంకే తెలుగు సినిమా లేదు. మహేష్ బాబు.. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలందరూ వేరే వేరే హీరోయిన్లతో కమిటై ఉన్నారు.
శ్రుతికి వీళ్లెవ్వరూ ఛాన్సులివ్వడం లేదా.. లేక ఆమే ఆఫర్లు కాలదన్నుకుంటోందా తెలియదు కానీ.. తెలుగులో ఈ ఏడాది ‘ప్రేమమ్’ కాకుండా శ్రుతిని మరో సినిమాలో చూస్తామా అన్నది అనుమానంగానే ఉంది. తన మాతృ భాష తమిళంలో సైతం శ్రుతి చేస్తున్నది ఒకే సినిమా. అది సూర్య సరసన చేస్తున్న ‘సింగం-3’ మాత్రమే. బహుశా ఆమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ మీదే ఉన్నట్లుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus