“అమితాభ్”భజన…అవకాశం కల్పిస్తుందా??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్..దాదాపుగా టాలీవుడ్ సినీ పరిశ్రమని ఏలుతున్న హీరోల్లో ఒకడు. అయితే టాలీవుడ్ లో తన స్థానాన్ని ఎవ్వరూ కైవసం చేసుకోలేనంతగా పవన్ టాలీవుడ్ లో పాగా వేశాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఎటువంటి ప్రభంజనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుందో అన్న ఆలోచనలో ఉన్న అభిమానులకు, పవన్ వరుసగా బాలీవుడ్ మీడియాకు ఇస్తున్న ఇంటర్‌వ్యూస్ పై….బాలీవుడ్ మీడియా పవన్ పై వేస్తున్న శెటైర్స్ కొంచెం బాధను కలిగిస్తున్నాయి. ఇంతకీ బాలీవుడ్ మీడియా ఏమంటుంది, ఎందుకు పవన్ ను టార్గెట్ చేసింది అంటే…సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో సైతం విడుదల అవనుంది అన్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ తాజాగా ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో, తనకు 8 ఏళ్ల వయస్సులో అమితాబ్ ను తాను కలుసుకున్న సంగతి గుర్తు చేస్తూ…ఆరోజు అమితాబ్ తనకు ఇచ్చిన షేక్ హ్యాండ్ లోని చల్లదనం తన గుండెల్లో పదిలంగా ఎప్పటికీ ఉండిపోతుంది అంటూ అమితాభ్ పై తనకున్న అభిమానాన్ని తెలిపాడు. అదే క్రమంలో తన కరియర్ తొలినాళ్ళలో…అమితాబ్ బాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న రోజులలో చేసిన ఫైట్ సీన్స్ ను అనుకరించానని తెలిపాడు.

ఇక తాను అమితాభ్ కు వీరాభిమానిని అంటూ చెబుతూనే, తనకు అమితాభ్ అంటే పిచ్చి అని తెలిపాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఎప్పుడూ లేనిది సడన్ గా పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ డబ్బింగ్ విడుదలకు ముందు అమితాబ్ పై భజన చేస్తూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం బట్టి పవన్ అతి తెలివితనం అందరికీ అర్ధం అవుతుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి ఈ భజన వర్షం ఎంతవరకూ పవన్ ను కాపాడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus