బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం జరిగిన రింగులో రంగు అనే టాస్క్ లో విజయం సాధించి అమ్మరాజశేఖర్ మాస్టర్ కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అవ్వగానే తన రూల్స్ చెప్తూ, వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ రూలర్ లాగా మారారు మాస్టర్. దీంతో హౌస్ మేట్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా అభిజిత్, హారిక ఇద్దరూ కూడా మాస్టర్ పనులకి అడ్డుచెప్తున్నారు. అంతేకాదు, సోహైల్ కూడా తన ప్రస్టేషన్ ని మాస్టర్ పై చూపిస్తున్నాడు. ఇక్కడే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది.
అమ్మరాజశేఖర్ కెప్టెన్ అయిన కారణంగా ఎలిమినేషన్ తప్పించుకుంటాడని, మళ్లీ బిగ్ బాస్ టీమ్ అమ్మని రక్షించేందుకు ఈ టాస్క్ డిజైన్ చేసిందని వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి కెప్టెన్ అయినంత మాత్రాన ఎలిమినేషన్ ని తప్పించుకోలేరు. కెప్టెన్ అయితే తర్వాత వారం నామినేషన్స్ తప్పంచుకోవచ్చు కానీ, ఎలిమిషన్ ని కాదు. కానీ, ఇక్కడ అమ్మరాజశేఖర్ మాస్టర్ విషయంలో ఎలిమినేషన్ అనేది జరగకుండానే జాగ్రత్తగా ఈ మూడు వారాల నుంచి ప్లానింగ్ నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ లవర్స్ మొత్తుకుంటున్నారు. లాస్ట్ వీక్ నోయల్ వల్ల మాస్టర్ సేఫ్ అయ్యారని, అంతకుముందు గుండు చేయించుకుని నామినేషన్స్ తప్పించుకున్నారని , ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు.
కానీ, నిజానికి మనం చూసినట్లయితే కెప్టెన్ అయినా కూడా ఎలిమినేషన్ ఉంటుంది. కొన్ని సార్లు ఇలా జరిగితే సీక్రెట్ రూమ్ లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సీజన్ వన్ లో కెప్టెన్ అయిన ముమైత్ ఖాన్ ని ఇలాగే సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఎలిమినేష్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్ కి పంపించి మళ్లీ దొంగలముఠాకి నాయకురాలిగా రీ ఎంట్రీ ఇప్పించారు. కానీ, ఇప్పుడు ముమైత్ ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేదు. ఇప్పుడు అమ్మరాజశేఖర్ మాస్టర్ ని సేవ్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటిద ఏదైనా ప్లాన్ చేస్తారా…? లేదా ఓటింగ్ లో లీస్ట్ ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ చేస్తారా అనేది ఆసక్తికరం.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?