Anirudh: అనిరుధ్ ఆమెనే పెళ్లి చేసుకోనున్నారా?

  • June 8, 2022 / 11:31 PM IST

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస ఆఫర్లతో అనిరుధ్ బిజీగా ఉన్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన బీస్ట్, విక్రమ్ సినిమాలు అనిరుధ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఆయనకు క్రేజ్ ను పెంచాయి. కొరటాల శివ డైరెక్షన్ లో తారక్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్30 సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కావడం గమనార్హం.

అయితే అనిరుధ్ ప్రముఖ సింగర్ జోనితా గాంధీతో ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా జోనితా గాంధీ సింగర్ గా బిజీగా ఉన్నప్పటికీ బీస్ట్ సినిమాలోని హలమిత్తి హబీబో సాంగ్ వల్లే ఆమె మరింత ఫేమస్ అయ్యారు. అనిరుధ్ గతంలో పలువురు హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం అనిరుధ్ సింగర్ తో ప్రేమలో ఉన్నాడని

వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా జోనితా గాంధీ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనగా ఆమెకు యాంకర్ కిల్, మ్యారీ, కిస్ అనే ఆప్షన్స్ ఇచ్చి సూర్య‌, ర‌ణ్ వీర్ సింగ్, అనిరుధ్ లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగితే జోనితా గాంధీ తడకుండా అనిరుధ్ పేరు చెప్పారు. జోనితా గాంధీ ఆ విధంగా చెప్పడంతో ఇప్పటికే అనిరుధ్ జోనితా గాంధీ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్తల గురించి అనిరుధ్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. జోనితా గాంధీ సరదాగా అలా చెప్పారా? లేక సీరియస్ గానే ప్రేమలో ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అనిరుధ్ జోనితా గాంధీ ఒక్కటి అవుతారేమో చూడాల్సి ఉంది. అనిరుధ్ త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus