Samantha: ఆ సెంటిమెంట్ ను హీరోయిన్ సమంత బ్రేక్ చేస్తుందా?

  • April 14, 2023 / 11:32 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత శాకుంతలం సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రేపు లారెన్స్ నటించిన రుద్రుడు కూడా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో అనే చర్చ జరుగుతోంది. లారెన్స్ సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సమంత సినిమాకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో మైథలాజికల్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం లేదు.

శాకుంతలం సినిమాతో సమంత (Samantha) ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. మరోవైపు రుద్రుడు సినిమాకు సైతం బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా అన్ని థియేటర్లలో ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉండటం గమనార్హం. శాకుంతలం, రుద్రుడు సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి. లారెన్స్ కు కూడా ఒక వర్గం ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సీ సెంటర్స్ లో లారెన్స్ సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. సమంత శాకుంతలం సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న దిల్ రాజు ఈ సినిమాతో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా రిటర్నబుల్ అడ్వాన్స్ ల మీద థియేటర్లలో విడుదలవుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే దేవ్ మోహన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది. దేవ్ మోహన్ సమంత జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus