“దేవుడు చేసిన మనుషులు” అనంతరం దాదాపు ఆరేళ్ళ విరామం తీసుకొని తెలుగులో “అమర్ అక్బర్ ఆంటోనీ”తో కమ్ బ్యాక్ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. “అమర్ అక్బర్ ఆంటోనీ”తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి బంపర్ స్టార్ట్ దొరుకుతుందని భావించిన ఇలియానాకి చుక్కెదురైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడమే కాక ఇలియానాకి కనీస స్థాయి గుర్తింపు కూడా లభీంచలేదు. పైగా.. సినిమాలో ఇలియానా మరీ బొద్దుగా కనిపించిందని, అసలు డ్యాన్సులు చేయలేకపోయిందని కామెంట్స్ వినిపించడంతో ఆమెను ఇమ్మీడియట్ గా సినిమాలోకి తీసుకొనేందుకు వేరే దర్శకనిర్మాతలెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో బాలీవుడ్ లో అప్పటివరకూ ఏర్పరుచుకున్న తన కాంటాక్ట్స్ ను వాడి మళ్ళీ అక్కడ ఆఫర్స్ సంపాదించేపనిలో పడింది.
అయితే.. రీసెంట్ గా రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పి మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తున్న ఇలియానా.. అర్జెంట్ గా సన్నబడింది. సన్నడబడదమే కాక.. కొన్ని హాట్ ఫోటోషూట్స్ చేయించుకొని మరీ “నేను సన్నబడ్డాను.. నన్ను ఇప్పుడు పట్టించుకోండి” అని ఇండైరెక్ట్ గా వేడుకొంటోంది. ఒకప్పుడు చాలా మంది టాలీవుడ్ దర్శకుడు ఇలియానా కోసం ప్రయత్నించారు.. కానీ ఆమె స్పందించలేదు. మరి ఇప్పుడు ఇలియానాను మన టాలీవుడ్ డైరెక్టర్స్ పట్టించుకొంటారా అనేది చూడాలి. కానీ.. సన్నబడ్డ ఇలియానా మాత్రం “నేను నా రాక్షసి”లో ఇలియానాలా భలే ఉంది.