Kalyan Ram: నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్న రికార్డ్ ఇదే!

  • August 8, 2022 / 11:36 AM IST

బింబిసార సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు పటాస్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే పటాస్ మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించినా ఆ సినిమా కలెక్షన్లు రికార్డులు సృష్టించే రేంజ్ లో లేవనే సంగతి తెలిసిందే. అయితే బింబిసార సినిమా మాత్రం తొలిరోజు నుంచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అయితే ఫుల్ రన్ లో బింబిసార 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఖాతాలో ఈ అరుదైన రికార్డ్ చేరాలని నందమూరి అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే కళ్యాణ్ రామ్ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ మార్కును అందుకోవడం కష్టం కాదు. అటు క్రిటిక్స్ నుంచి ఇటు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకోవడం

వల్లే కళ్యాణ్ రామ్ ఖాతాలో ఈ అరుదైన రికార్డ్ చేరిందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధంగా కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ నటించలేరన్నంత అద్భుతంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో బింబిసార2 సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

బింబిసార2 ఖర్చు విషయంలో కూడా రాజీ పడనని కళ్యాణ్ రామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలో బింబిసార2 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మల్లిడి వశిష్ట్ ఫస్ట్ పార్ట్ ను మించేలా ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని బోగట్టా. బింబిసార2 కథ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. బింబిసార2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus