“మెలోడీ బ్రహ్మ” అని తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుగా పిలుచుకొనే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపాదడపా చిన్న చిన్న సినిమాలకు సంగీతాన్ని, పెద్ద సినిమాలకు నేపధ్య సంగీతాన్ని సమకూరుస్తూ అలా అలా కెరీర్ ను నెట్టుకొస్తున్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్, సాయికార్తీక్, గోపీ సుందర్ లాంటి యాంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు వరుస సినిమాలతో దూసుకుపోతుండడం కూడా అందుకు కారణమనుకోండి.
అయితే.. మణిశర్మ మళ్ళీ ట్రాక్ ఎక్కుతున్నాడు. మామూలుగా తాను సంగీతం సమకూర్చిన స్టార్ హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకు కూడా రాణి మణిశర్మ నిన్న జరిగిన “జెంటిల్ మెన్” సినిమా ఆడియో వేడుకకు రావడం గమనార్హం.
దాంతో.. మణిశర్మ మళ్ళీ తన హవా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడని, తనతో మంచి అనుబంధం ఉన్న కొంతమంది డైరెక్టర్లను మణిశర్మ స్వయంగా కలిశాడని తెలుస్తోంది!