సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాప్యులర్ అయ్యింది హీరోయిన్ నయనతార. నచ్చినట్లు బ్రతకాలి అనే సిద్ధాంతం ఫాలో అయ్యే నయన ఎవరు ఏమనుకున్నా పట్టించుకోదు. ఒక పక్క వివాదాలు, ఎఫైర్స్ తో వార్తలలో నిలుస్తూనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె రికార్డులకు ఎక్కారు. కెరీర్ బిగినింగ్ లోనే హీరో శింబు ప్రేమలో పడింది నయన. ఆయనతో వరుసబెట్టి సినిమాలు చేయడంతో పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.
భార్యాభర్తలకు మించి బంధం మాది అన్నట్లు కలిసి ఉన్నారు. చివరికి పెళ్లి కాకుండానే విడిపోయారు. ఆ తరువాత ఎవరు దారిన వాళ్ళు బ్రతుకున్నారు. శింబుతో బ్రేకప్ అయ్యాక నయనతార కొద్దిగా గ్యాప్ ఇచ్చి అప్పటికే పెళ్ళై పిల్లలున్న ప్రభుదేవా ప్రేమలో పడింది. పెళ్ళైన వాడితో మరియు తనకంటే వయసులో పెద్దవాడితో ప్రేమాయణం అనేసరికి అందరూ ముక్కున వేలువేసుకున్నారు. చివరకు నయన కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చారు.

అంత రిస్క్ చేసిన ప్రభుదేవా నయనకు భర్త కాలేకపోయాడు. రెండు బ్రేక్ అప్స్ తరువాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ఎఫైర్ పెట్టుకుంది. మరి ఇతడినైనా పెళ్లి చేసుకుంటుందా అనే డౌట్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాలలో మొదలైంది. ఏళ్లుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారే కానీ, పెళ్లి అనడం లేదు. ఒక పక్క పెళ్లి వార్తలు వస్తున్నా స్పందించడం లేదు. మరి చూడాలి నయన-విగ్నేష్ బంధం ఎలాంటి మలుపు తెరుగుతుందో.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
