Pawan Kalyan: ఆ సెంటిమెంట్ ను పవన్ కళ్యాణ్ బ్రేక్ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సొంత కథతో ఒక సినిమా త్వరలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ సొంత కథలతోనే తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే పవన్ సొంత కథతో తెరకెక్కుతున్న తర్వాత ప్రాజెక్ట్ లు అయినా భారీ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది. సొంత కథలతో తెరకెక్కిన పవన్ సినిమాలు ఫ్లాప్ కాగా ఆ సెంటిమెంట్ ను పవన్ తర్వాత సినిమాతో బ్రేక్ చేస్తారేమో చూడాలి. పవన్ కళ్యాణ్ సొంత కథకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. సొంత కథలు పవన్ కోరుకున్న సక్సెస్ ను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వేగంగా సినిమాలలో నటించడంపై పవన్ దృష్టి పెడుతుండగా పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు ఎప్పటికి పూర్తవుతాయో స్పష్టత రావాల్సి ఉంది. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన పలు ప్రాజెక్ట్ లను పవన్ క్యాన్సిల్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను పవన్ కళ్యాణ్ ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియాల్సి ఉంది. పవన్ తో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus