Salaar Trailer: సలార్ మూవీ ఆ విషయంలో చరిత్ర సృష్టించడం ఖాయమేనా?

  • December 1, 2023 / 01:44 PM IST

మరికొన్ని గంటల్లో సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు మిగతా సినిమాలు క్రియేట్ చేసిన అన్ని రికార్డులను ఈ సినిమా ట్రైలర్ బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో చరిత్ర సృష్టిస్తుందని వ్యూస్, బుకింగ్స్ విషయంలో సైతం సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. త్వరలో సలార్ సినిమాకు సంబంధించి మరికొన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది.

సలార్2 సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు. ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ నమ్మకం నిజం కావాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. ప్రశాంత్ నీల్ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ బాహుబలి2 సినిమా తర్వాత నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. సలార్, సలార్2 హిట్టైతే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లు కాగా ఈ సినిమాలు అంచనాలను మించి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సాధిస్తాయేమో చూడాల్సి ఉంది.

సలార్ (Salaar) ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి. ప్రభాస్ భవిష్యత్తు సినిమాల ఫలితాలు సైతం ఈ సినిమాపై ఆధారపడి ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus